మన దేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రాలు ఉన్నాయి.ఈ శైవక్షేత్రాలలో కొన్ని ఆలయాలలో శివుడు స్వయంభువుగా వెలసి ఉండగా, మరి కొన్ని ఆలయాలలో ఋషులు, దేవతల చేత ప్రతిష్టించబడి ఉన్నాయి.
ఈ విధంగా స్వయంభూగా వెలిసిన లింగాలలో శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయం ఒకటి.ఈ ఆలయంలో స్వామి వారు చెట్టు మొదలే స్వయంగా లింగావతారంలో కొలువై భక్తులకు దర్శనం ఇస్తున్నారు.
ఈ విధంగా చెట్టు మొదలులో వెలసిన ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశిష్టత ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
శ్రీకాకుళం జిల్లాలోని జలమూరు మండలం శ్రీముఖ లింగం గ్రామంలో ఉన్న మధుకేశ్వరాలయం ఒకటి.
దీనిని అంతా శ్రీ ముఖలింగేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు.శ్రీముఖ ఆలయాన్ని క్రీస్తు శకం 10వ శతాబ్దంలో కళింగ రాజు రెండవ కామార్ణవుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.
ఈ ఆలయంలో కొలువై ఉన్న స్వామివారు విగ్రహం రాతితో చెక్కినది కాదు.ఈ ప్రాంతంలో ఇప్ప చెట్టును నరికి వేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది.
ఈ చెట్టును సంస్కృత భాషలో మధుకం అని పిలుస్తారు.అందుకే ఈ ఆలయాన్ని మధుకేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు.

సాధారణంగా ఏదైనా గర్భాలయంలో ఓకే ఓకే శివలింగం ఉంటుంది.కానీ ఆలయంలో మాత్రం ఎనిమిది దిక్కులలో 8 శివలింగాలు ఉన్నాయి.ఈ ఆలయానికి కొంత దూరంలో భీమేశ్వరాలయం, మరికొంత దూరంలో సోమేశ్వరాలయం ఉంది.ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు.ప్రస్తుతం ఈ ఆలయ బాధ్యతలను పురావస్తుశాఖ చూసుకుంటుంది.ఈ ఆలయంలో స్వామివారి దర్శనార్థం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒరిస్సా నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయానికి చేరుకుంటారు.