హిందూ ధర్మంలో( Hinduism ) గంగా జలానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది.పూర్వ కాలం నుంచి మన దేశంలో గంగా దేవిని తల్లిలాగా, అందులోని జలాన్ని అమృతంగా భావిస్తారు.
గంగా దేవిని ( Goddess Ganga )మోక్ష ప్రదాత అని పిలుస్తారు.అందుచేత మరణించిన తర్వాత గంగాజలం నోటిలో పోసే సంప్రదాయం ఉంది.
గంగాదేవి నీరు చాలా స్వచ్ఛమైనది.నదిలో నీరు ఎన్నటికీ పాడవదు.
అంతే కాకుండా ఎటువంటి హానికరమైన బ్యాక్టీరియా కూడా గంగా నీటిలో ఉండదు.ఈ కారణంగా కూడా గంగా జలం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.
హిందూ మత విశ్వాసాల ప్రకారం గంగా నదిలో స్నానం చేయడం వల్ల మనుషులు చేసిన అన్ని పాపాలు నశించి పవిత్రంగా మారుతారు.
ఈ కారణంగా గంగా నదిలో స్నానానికి ప్రత్యక ప్రాముఖ్యత ఉంటుంది.హిందువుల పండుగలు, పర్వదినాలలో లక్షలాది మంది భక్తులు గంగా నదిలో స్నానాలు చేసేందుకు వస్తూ ఉంటారు.పూజలలో కూడా పవిత్ర గంగా జలాన్ని ఉపయోగిస్తారు.
దాదాపు అందరూ హిందువులు గంగాజలాన్ని తమ ఇళ్లలో లేదా తమ ఇంటిలోని పూజ గదిలో ఉంచుతారు.గంగా జలాన్ని( Ganga water ) ఇంట్లో ఉంచుకోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయి.
అప్పుడే గంగాజలాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే అన్ని రకాల ప్లాస్టిక్ సీసాలలో లేదా డబ్బాలలో నింపుకొని ఇంటికి వస్తారు.ఇంట్లో కూడా అలాగే ఆ డబ్బాలోనే ఉంచుతారు.అయితే ఇలా చేయడం చాలా తప్పుగా నిపుణులు చెబుతున్నారు.
గంగాజలం ఎంతో పవిత్రమైనది.కాబట్టి దానిని ఉంచే పాత్ర కూడా ఎంతో స్వచ్ఛంగా ఉండాలి.
వెండి, రాగి, ఇత్తడి లేదా మట్టి పాత్రలో గంగాజలాన్ని ఉంచడం మంచిది.గంగాజలం ఉంచే ప్రదేశం ఎంతో పవిత్రంగా ఉండాలి.
గంగాజలం ఏదైనా గదిలో ఉంచినట్లయితే పొరపాటున కూడా మాంసాహారం లేదా మద్యం సేవించకూడదు.గంగాజలాన్ని ఎండ ఉన్న ప్రదేశంలో లేదా బహిరంగ ప్రదేశంలో ఉంచకూడదు.
అలాగే గంగాజలాన్ని వంటగది లేదా బాత్రూంలో అస్సలు ఉంచకూడదు.
LATEST NEWS - TELUGU