రాజకీయాలో ఎప్పుడూ ఒకే రకమైన పరిస్థితి ఉండదు. ఓడలు బళ్ళు .
బళ్ళు ఓడలుగా మారడం ఇక్కడ సర్వసాధారణం.ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు సార్లు వరుసగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది.
మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధిస్తామని కెసిఆర్( KCR ) లో ధీమా కనిపించినా.ఎన్నికల ఫలితాలు మాత్రం కేసీఆర్ కు తీవ్ర నిరాశపరిచాయి.ఊహించని విధంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని కేసీఆర్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.మరోవైపు కేంద్ర అధికార పార్టీ బిజెపితోనూ వైరం ఉండడం, ఈ వ్యవహారంతో పాటు, అనేక కేసుల్లో బీఆర్ఎస్ నేతలపై కేసు లు నమోదు కావడం, వరుసగా అరెస్టులు జరుగుతుండడంతో, బిఆర్ఎస్ లో గందరగోళం నెలకొంది.
ఇప్పటికే పార్టీకి చెందిన కీలక నేతలు చాలామంది ఇతర పార్టీల్లో చేరిపోయారు.ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్( Delhi Liquor Scam ) వ్యవహారంలో కేసీఆర్ కుమార్తె కవిత జైలులో ఉన్నారు.

మరోవైపు ఫోన్ ట్యాపింగ్ ( Phone tapping )వ్యవహారం మరింత తలనొప్పిగా మారింది.ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉండడంతో, బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన రోజురోజుకు పెరిగిపోతోంది.ఇంకోవైపు చూస్తే పార్లమెంట్ ఎన్నికల హడావుడి కనిపిస్తోంది.ఎన్నికల్లో బీఆర్ఎస్ కనుక సరైన ఫలితాలు సాధించకపోతే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ గడ్డ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది.సీఎంగా ఉన్న సమయంలో కేసీఆర్ ఎక్కువ ఫామ్ హౌస్ కి పరిమితం అన్నట్లుగా వ్యవహరించేవారు.ఇప్పుడు మాత్రం వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాదిరిగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ కు అనుకూల ఫలితాలు వెలువడితే సరే లేదంటే పార్టీని ముందుకు నడిపించడం మరింత కష్టతరం అవుతుందని, అలాగే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, బిజెపి( Congress, BJP)లలోకి వలసలు మరింత పెరిగిపోతాయి అనే విషయాన్ని గ్రహించే కేసీఆర్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకునే విషయంపై సీరియస్ గా దృష్టి పెట్టారు.

ఇక ఏదో ఒక విషయం ద్వారా జనాల్లోకి వెళ్లడం ద్వారా వారికి మరింత దగ్గర అవ్వవచ్చని లెక్కలు వేసుకుంటున్నారు.ఈ మేరకు తెలంగాణలో పర్యటించేందుకు బస్సు యాత్ర చేపట్టేందుకు కేసిఆర్ సిద్ధం అవుతున్నారు.మిర్యాలగూడ నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది.
రాత్రికి నియోజకవర్గాల్లోనే కెసిఆర్ బస చేస్తారు.అలాగే పొలం బాట కూడా పట్టనున్నారు.
ఇక ఎన్నికలు ముగిసిన తరువాత కూడా నిత్యం జనాల్లో ఉంటూ .ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ .కాంగ్రెస్ బిజెపిలపై పై చేయి సాధించాలని కేసిఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు.