వర్షాకాలం వచ్చిందంటే చాలు భూగర్భ జలాలు, నదులు, సరస్సులు నిండుకుండలా మారిపోతూ ఉంటాయి.అలాగే వాతావరణం కూడా ఎంతో చల్లగా ఉంటుంది.
ఈ సీజన్ ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, అన్ని వ్యాధులను కూడా తీసుకొస్తుంది.అందుకే ఈ సీజన్ మొదలైంది అంటే పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి.
లేదంటే మాత్రం అనారోగ్య సమస్యల బారినపడడం ఖాయం.ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే ఆహారం విషయంలో,అలాగే తాగే నీళ్ల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి.

వర్షాల కారణంగా కొత్తనీళ్లు తాగడం వల్ల ఫీవర్‌తో పాటు దగ్గు, జలుబు( Cough ) వంటివి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.మరి ముఖ్యంగా ఈ సీజన్లో కామెర్ల వ్యాధి సంభవిస్తూ ఉంటుంది.ఈ వ్యాధి సోకిన వారు బరువు రోజురోజుకు తగ్గుతుంది.శరీరం పసుపు రంగులోకి మారుతుంది.అలాగే వారి కళ్లు పసుపు రంగులోకి మారుతాయి.అంతేకాకుండా ఈ వ్యాధి కారణంగా రక్తంలో బిలిరుబిన్విడుదలవుతుంది.
అయితే ఈ వ్యాధి సోకిన వారు కొన్ని ఆహార పదార్థాలలో దూరంగా ఉండాలి.లేదంటే ప్రాణాపాయం సంభవిస్తుంది.
మరి కామెర్ల వ్యాధి వచ్చినవారు ఏ ఆహారాన్ని దూరంగా ఉండాలి.ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే కామెర్ల వ్యాధి సోకిన వారు అరటిపండు అసలు తినకూడదు.ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ క్రియ క్షీణిస్తుంది.అంతేకాకుండా అరటి పండు తినడం కారణంగా రోగి శరీరంలో బిలిరుబిన్( Bilirubin ) స్థాయి వేగంగా పెరుగుతుంది.అందుకే కామెర్ల వ్యాధి వచ్చినవారు తమకు హాని కలిగించని పండ్ల( Fruit)ను మాత్రమే తినాలి.
ఇంకా చెప్పాలంటే కాఫీ, టీలో కెఫిన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది.అందుకోసం కామెర్లు సోకిన వ్యక్తి ఈ పానీయాలను దూరంగా ఉండటమే మంచిది.ఇంకా చెప్పాలంటే కామెర్లు వచ్చిన వ్యక్తి పంచదారను కూడా దూరంగా ఉండాలి.లేదంటే కాలేయం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంది.
అలాగే మసాలాలు( Spices ), నూనె అధికంగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.







