ఓ యువకుడు వివాహానికి ముందు మీ కూతుర్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని ఆ యువతీ తండ్రికి మాట ఇచ్చి వివాహం చేసుకున్నాడు.వివాహం తర్వాత కొన్ని సంవత్సరాలు మాట ఇచ్చిన ప్రకారం భార్యను బాగానే చూసుకున్నాడు.
కానీ భార్యకు అక్రమ సంబంధం( Extramarital Affairs) ఉందేమో అనే అనుమానంతో భార్యను గొడ్డలితో అత్యంత దారుణంగా నరికి హత్య చేశాడు.ఈ ఘటన కర్ణాటక( Karnataka )లోని బాగల్ కోటే జిల్లా లోని బిసనాళ గ్రామంలో చోటుచేసుకుని స్థానికంగా అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటో చూద్దాం.వివరాల్లోకెళితే.
బిసనాళ గ్రామంలో పరసప్ప(29) నివాసం ఉంటున్నాడు.ఈ గ్రామనికి సమీపంలో ఉండే గ్రామంలో నివాసం ఉంటున్న రేఖా (25) అనే యువతి ఇంటికి వెళ్లి, రేఖా తండ్రితో మీ అమ్మాయిని ఇచ్చి చేయాలని కోరాడు.
అయితే రేఖాను పరసప్ప కు ఇచ్చి పెళ్లి చేయడానికి ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు.
కానీ పరసప్ప తన కుటుంబ సభ్యులను, బంధువులను వెంట తీసుకుని వెళ్లి రేఖా కుటుంబ సభ్యులతో మాట్లాడించి, ఒప్పించాడు.
అందరూ అమ్మాయిని ఏ లోటు రాకుండా చూసుకుంటాడు అని హామీ ఇవ్వడంతో రేఖా తండ్రి సరే అని అంగీకరించాడు.పరసప్ప, రేఖాను వివాహం చేసుకున్న మూడు సంవత్సరాల పాటు సంతోషంగా కాపురం చేశాడు.
ఆ తరువాత మేస్త్రీ పని చేస్తున్న పరసప్పకు అతని భార్య పై అనుమానం వచ్చింది.తాను ఉదయం వెళితే, రాత్రికి ఇంటికి తిరిగి వస్తున్నానని, ఇంట్లో ఒంటరిగా ఉండే రేఖా ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకొని ఎంజాయ్ చేస్తుంది అనే అనుమానం పెరిగింది.

ఇక ఇంట్లో రేఖా, పరసప్ప ల మధ్య తరచూ గొడవలు జరగడం మొదలయ్యాయి.గ్రామస్తులు ఎంత చెప్పినా తరచూ గొడవలు జరుగుతూ ఉండడంతో గ్రామంలో ఎవరు కూడా వీరి గొడవ గురించి పట్టించుకోవడమే మానేశారు.తాజాగా మంగళవారం రాత్రి ఈ దంపతుల మధ్య గొడవ జరిగింది.నీ ప్రియుడిని మరిచిపోయి నాతో కలిసి ఉండాలని, లేదంటే నిన్ను చంపేస్తానని పరసప్ప అతని భార్య రేఖ( Rekha )ను హెచ్చరించాడు.
కాసేపు మాటలు యుద్ధం జరిగాక ఇంట్లో ఉన్న గొడ్డలి తీసుకుని రేఖా గొంతును కర్రలు చీల్చినట్లు చీల్చి నరికేశాడు.వెంటనే రేఖా కింద పడి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతు చనిపోయింది.
బుధవారం బంధువులు ఇంటికి వెళ్లి చూస్తే రేఖా హత్యకు గురైన విషయం తెలిసింది.పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పరసపను అరెస్టు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్న ఆసుపత్రికి తరలించారు.







