గుంటూరులో బుధవారం రాత్రి భారీ దోపిడీ జరిగింది.ఇంటికి తాళం వేసి ఉండడంతో.
ఇంటిలోకి ప్రవేశించి ఇంట్లో ఉండే బంగారు ఆభరణాలు, ఆభరణాలతో పాటు నగదును మొత్తం దొంగ దోచుకొని వెళ్లిపోయాడు.దోపిడికి సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
వివరాల్లోకెళితే.గుంటూరు( Guntur ) నగరంలోని కొత్త పేట ఏరియాలో నరసింహారావు కుటుంబం నివాసం ఉంటోంది.
అయితే నరసింహారావు కుమారుడు బుధవారం వైజాగ్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.కుమారుడిని వందే భారత్ ట్రైన్ ఎక్కించేందుకు కుటుంబ సభ్యులంతా విజయవాడకు వెళ్లారు.

ఇంటికి తాళం వేసి ఉండడాన్ని చూసి దొంగ చుట్టుపక్కల అంతా గమనించి, తాళం పగలగొట్టి ఇంటి లోపలికి ప్రవేశించాడు.ఇంట్లో ఉండే బీరువాను పగులగొట్టి అందులో ఉండే 3 కేజీల బంగారు ఆభరణాలు( Gold ), 2 కేజీల వెండి ఆభరణాలతో పాటు రూ.2 లక్షల నగదును తీసుకుని ఇంటి బయటకు వచ్చాడు.అక్కడ కొందరు ఎవరు అని ప్రశ్నించగా ఈ ఇంటికి బంధువుని అంటూ చెప్పుకుంటూ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు.
విజయవాడ( Vijayawada ) నుంచి తిరిగి వచ్చిన నరసింహారావు కుటుంబం తలుపు తీసి ఉండడంతో హడావిడిగా లోపలికి వెళ్లి చూస్తే ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండడం, బెడ్ రూమ్ లోని బీరువా పగులగొట్టి ఉండడం చూసి దొంగలు పడినట్లు గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

అయితే బ్యాంక్ లాకర్ కేటాయించడంలో కాస్త జాప్యం జరిగిన కారణం వల్ల ఆభరణాలను ఇంట్లో పెట్టుకున్నట్లు బాధితులు తెలిపారు.ఈ దొంగతనం బుధవారం రాత్రి 7 నుండి 8 గంటల మధ్యలో జరిగినట్లు పోలీసులు( Police ) గుర్తించారు.పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో ఉండే ఇంట్లో దొంగతనం జరగడం తో ఈ విషయం తెలిసిన వారంతా షాక్ అయ్యారు.
పైగా ఈ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది.ఇంత రద్దీగా ఉండే ప్రాంతంలో భారీ దోపిడీ జరగడంతో స్థానికులు కాస్త భయాందోళనకు గురయ్యారు.







