ట్రేడ్ పండితులు సైతం ఊహించని అద్భుతాలు ఎన్నో కరోనా లాక్ డౌన్ తర్వాత చోటు చేసుకున్నాయి.ఒకానొక దశలో ఓటీటీ అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత ఇక థియేటర్స్ కి ప్రేక్షకులు ఎవరూ రారు అని అనుకున్నారు, టాలీవుడ్ సంక్షోభం లో పడిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.
కానీ ఆ తర్వాత థియేటర్స్ లో విడుదలైన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించడం తో మంచి సినిమా తీస్తే చాలు, ఆడియన్స్ నెత్తిన పెట్టుకొని మరీ ఆదాటిస్తారు అని నిరూపించాయి.ఆ తర్వాత పెద్ద సినిమాల కంటే కూడా చిన్న సినిమాలు మరియు డబ్బింగ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సునామి ని తలపించే వసూళ్లను రాబట్టి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసాయి.
ఇక రీసెంట్ సమయం లో విడుదలైన స్టార్ హీరోల సినిమాలు, మరియు పెద్ద బడ్జెట్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టున్నా సంగతి అందిరికీ తెలిసిందే.

అలాంటి సమయం లో ఒక చిన్న సినిమా రీ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది.ఇలాంటి కలెక్షన్స్ వస్తాయని బహుశా మేకర్స్ కూడా ఊహించి ఉండరు.ఆ సినిమా పేరే ‘ఈ నగరానికి ఏమైంది( Ee Nagaraniki Emaindi )’, యూత్ కి బాగా దగ్గరైన ఈ చిత్రం రీ రిలీజ్ అయ్యి ముందు వసూలు చేసిన దానికంటే కూడా ఎక్కువ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది.
దీనిని బట్టీ అర్థం అయ్యింది ఏమిటంటే ఆడియన్స్ ఒక మంచి సినిమాని థియేట్రికల్ అనుభూతి కోసం ఎంతో పరితపిస్తున్నారని.ఇప్పటి వరకు విడుదలైన స్టార్ హీరోల రీ రిలీజ్ లలో ఒక్క ఖుషి( Kushi ) మరియు సింహాద్రి మినహా, అన్నీ చిత్రాల కలెక్షన్స్ ని దాటేసింది ఈ చిత్రం.
ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఈ సినిమా ఇప్పటి వరకు మూడు కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

‘ఈ నగరానికి ఏమైంది’ మొట్టమొదటి సారి విడుదలైనప్పుడు మూడు కోట్ల రూపాయిల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది.కానీ రెండవ సారి రీ రిలీజ్ అయ్యినప్పుడు ఈ చిత్రానికి మొదట విడుదల అయ్యినప్పటి కంటే ఎక్కువ వసూళ్లు రావడం అందరినీ షాక్ కి గురి చేస్తుంది.ఇప్పుడు ఈ రికార్డు ని అందుకోవడం స్టార్ హీరోలకు కూడా కష్టం అనే చెప్పాలి.
అలాంటి రికార్డు ని నెలకొల్పింది ఈ సినిమా.ఓటీటీ లో విడుదలైనప్పుడు యూత్ ఎగబడి చూడడం వల్ల ఈ చిత్రానికి కల్ట్ క్లాసిక్ స్టేటస్ వచ్చిందని, ఇలాంటి చిన్న సినిమాలు ఇంకా చాలానే ఉన్నాయి అని, అవి కూడా ఇలాగే స్టార్ హీరో రేంజ్ వసూళ్లను రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
అలాంటి సినిమాలలో ఒకటి 7/G బృందావన కాలనీ, ఈ సినిమా విడుదలైతే ఖుషి రికార్డ్స్ సైతం బద్దలైన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.







