ఆ గిఫ్ట్ చూసి ఎమోషనల్ అయిన స్టార్ యాంకర్ రష్మీ.. అసలేం జరిగిందంటే?

తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ రష్మీ ( Anchor Rashmi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.రష్మీ ప్రస్తుతం ఒక వైపు సినిమాలో నటిస్తూనే మరొకవైపు యాంకర్ గారు రాణిస్తున్న విషయం తెలిసిందే.

 Rashmi Gautam Cried At Sridevi Drama Company Details, Rashmi Gautham, Tollywood-TeluguStop.com

ఇటు బుల్లితెర ప్రేక్షకులను అటు వెండితెర ప్రేక్షకులను అలరిస్తోంది.జబర్ధస్త్ ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకుంది.

ప్రస్తుతం జబర్దస్త్ షో తో పాటు ఎక్స్ట్రా జబర్దస్త్ అలాగే పండుగ ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తోంది.ఇదిలా ఉంటే రష్మీ శ్రీదేవి డ్రామా కంపెనీ( Sridevi Drama Company ) వేదికపై భావోద్వేగానికి గురైంది.

పొట్టి నరేష్ చిన్న పిల్లల గ్యాంగ్ తో కలసి పిక్ నిక్ కి తీసుకెళ్లలేదని గోల చేస్తుంటారు.

Telugu Anchor Rashmi, Chutki Gautam, Rashmi, Rashmi Gautam, Rashmi Gautham, Rash

అప్పుడు హైపర్ ఆది ఎంట్రీ ఇస్తాడు.హైపర్ ఆది, రోహిణి, చిన్న పిల్లల మధ్య కామెడీ ఆకట్టుకుంటుంది.హైపర్ ఆది పవన్ కళ్యాణ్ తరహాలో కరాటే స్టంట్ లు చేయాలని ప్రయత్నించి దెబ్బై పోతాడు.

కరాటే స్టంట్ లని హైపర్ ఆది నవ్వులు పూయించే విధంగా చేశాడు.ఇక చివర్లో రష్మీ బర్త్ డే సెలెబ్రేషన్స్( Rashmi Birthday Celebrations ) జరుగుతాయి.ఈ నెల 27న రష్మీ తన జన్మదిన వేడుకలు సెలెబ్రేట్ చేసుకోబోతోంది.28 న ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతోంది కాబట్టి శ్రీదేవి డ్రామా కంపెనీలో రష్మీ తన పుట్టినరోజు సెలెబ్రేషన్స్ జరుపుకుంది.

Telugu Anchor Rashmi, Chutki Gautam, Rashmi, Rashmi Gautam, Rashmi Gautham, Rash

డాన్స్ మాస్టర్ పండు( Dance Master Pandu ) తన డ్యాన్స్ పెర్ఫామెన్స్ తో రష్మీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఇంప్రెస్ చేశాడు.చాలా అందంగా మాస్టర్ పండు ఆమెకి బర్త్ డే విషెష్ చెప్పడం విశేషం.ఇక చివర్లో పిల్లలు రష్మీకి ఒక ఫోటో గిఫ్ట్ గా ఇచ్చారు.ఆ ఫోటో చూడగానే ఒక్కసారిగా రష్మీ వెక్కి వెక్కి ఏడ్చేసింది.దానికి కారణం ఆ ఫొటోలో ఉన్నది తన పెంపుడు కుక్క చుట్కి గౌతమ్.చుట్కి గౌతమ్ ఇటీవల అనారోగ్యంతో మరణించినట్లు రష్మీ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఆ కుక్కకి రష్మీ దహన సంస్కారాలు కూడా నిర్వహించింది.ఇప్పుడు తన పెంపుడు కుక్కని ఒక్కసారి ఫొటోలో చూడడంతో రష్మీ ఏడుపు ఆపుకోలేకపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube