మద్యం మత్తులో తోటి భారత సంతతి వ్యక్తి చూపుడు వేలును కొరికేసిన కేసులో భారత సంతతి వ్యక్తికి సింగపూర్ కోర్టు( Singapore court ) 10 నెలల జైలు శిక్ష విధించింది.ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించినట్లు సింగపూర్ మీడియా కథనాలు ప్రసారం చేసింది.
నిందితుడు తంగరాసు రెంగసామి ( Rengasami )(40), ఇతను ఎక్స్‌కవేటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.ఈ క్రమంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ అయిన నాగూరన్ బాలసుబ్రమణియన్( Naguran Balasubramanian ) (50)ని ఉద్దేశ్యపూర్వకంగా గాయపరిచినట్లు అంగీకరించాడు.
నేరం జరిగిన సమయంలో ఇద్దరు భారతీయులు బెడోక్‌లోని పారిశ్రామిక ప్రాంతమైన కాకీ బుకిట్‌లోని వేర్వేరు విదేశీ కార్మికుల వసతి గృహాలలో నివసిస్తున్నారని ది స్ట్రెయిట్స్ టైమ్స్( The Straits Times ) నివేదించింది.అయితే నాగూరన్ తెగిపోయిన వేలు భాగాన్ని కనుగొనలేకపోయారు.
దాడికి ముందు నాగూరన్ మరో భవన నిర్మాణ కార్మికుడు రామమూర్తి అనంతరాజ్‌లు( Ramamurthy Anantrajs ) రాత్రి 10 గంటల సమయంలో మద్యం సేవిస్తున్నారని కోర్టు పేర్కొంది.ఏప్రిల్ 22న వీరిద్దరికి ఐదు మీటర్ల దూరంలో మద్యం మత్తులో కూర్చొన్న తంగరాసు కేకలు వేయడం ప్రారంభించాడు.
సౌండ్ తగ్గించాల్సిందిగా తంగరాసుని రామ్మూర్తి బిగ్గరగా అరుస్తూ కుడిచేయిని పైకెత్తి అతని వైపు నడుచుకుంటూ వెళ్లాడు.ఈ క్రమంలో తంగరాసును చెంపదెబ్బ కొట్టడంతో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది.
వీరిని నాగూరన్ విడదీయడానికి ప్రయత్నించాడు.ఇంతలో నాగూరన్ ఎడమ చూపుడు వేలు అనుకోకుండా నిందితుడిని నోట్లోకి వెళ్లింది.
వెంటనే తంగరాసు.ఆ వేలిని కొరికాడని డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కై చెన్ఘన్( Deputy Public Prosecutor Kai Chenghan ) ది స్ట్రెయిట్స్ టైమ్స్ విచారణలో పేర్కొన్నాడు.

ఘర్షణలో నిందితుడు, బాధితుడు నేల మీద పడిపోయారని అయినప్పటికీ తంగరాసు వేలిని మాత్రం వదల్లేదని ప్రాసిక్యూటర్ చెప్పారు.తంగరాసుని దూరంగా లాగేందుకు రామ్మూర్తి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు.ఎట్టకేలకు నాగూరన్‌కు విముక్తి లభిండంతో వెంటనే చాంగి జనరల్ హాస్పిటల్‌కు వెళ్లాడు.అతని వేలు పాక్షికంగా కత్తిరించినట్లుగా నిర్ధారించిన వైద్యులు, శస్త్రచికిత్స అవసరమని చెప్పారు.అతనికి 14 రోజుల హాస్పిటలైజేషన్ లీవ్ ఇచ్చినట్లు ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు.తంగరాసుకు 10 నెలల నుంచి ఏడాది జైలు శిక్ష విధించాలని డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు.
సింగపూర్ చట్టాల ప్రకారం ఉద్దేశ్యపూర్వకంగా తీవ్రమైన గాయాన్ని కలిగిస్తే నిందితుడికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించబడుతుంది.