సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు చిరంజీవి ( Chiranjeevi ) ఒకరు.ఈయన ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.
ఇక చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి రాంచరణ్( Ram Charan ) అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి రాంచరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్నారు.
ఇలా తన కొడుకు సినీ కెరియర్ చూసి చిరంజీవి పుత్రోత్సాహంతో సంబరపడుతున్నారనే చెప్పాలి.ఇక ప్రస్తుతం ఈయన చేసే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇదిలా ఉండగా తాజాగా రాంచరణ్ కి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.ఈయన ఇండస్ట్రీలో హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మంచి సక్సెస్ అందుకున్నారు.
అయితే ఈయన తన తండ్రి కోసం సింగర్( Singer ) గా కూడా మారారు అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావిడి కొనసాగుతుంది.
ఈ క్రమంలోనే చిరంజీవి ప్రజారాజ్యం( Prajarajyam ) పార్టీ స్థాపించిన సమయంలో పార్టీ కోసం మణిశర్మ సంగీతంలో ఒక పొలిటికల్ సాంగ్ విడుదల చేశారు.అయితే ఆ పాట చిరంజీవి నటించిన రాజా విక్రమార్క సినిమాలోని పాటను ప్రజారాజ్యం కోసం పాడారు.అయితే ఈ పాటను స్వయంగా రామ్ చరణ్ పాడటం గమనార్హం.అయితే ఈ విషయం ప్రస్తుతం వెలుగులోకి రావడంతో తండ్రి కోసం కొడుకు ఏకంగా సింగర్ గా మారారా అంటూ అభిమానులు ఇందుకు సంబంధించిన ఈ వార్తను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.