అమెరికన్ దిగ్గజ కంపెనీలు గూగుల్,( Google ) అమెజాన్‌లు( Amazon ) వలసదారులకు షాకిచ్చాయి.ఇమ్మిగ్రెంట్స్ కోసం గ్రీన్‌కార్డు దరఖాస్తులను( Green Card Applications ) ఈ ఏడాది మిగిలిన భాగం వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.
మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు ఇటీవల ఉద్యోగుల తొలగింపు కార్యక్రమాల మధ్య ఈ పరిణామం చోటు చేసుకుంది.పోటీ తీవ్రంగా ఉండటంతో విదేశీ కార్మికుల పరిస్ధితి ప్రస్తుతం దయనీయంగా మారుతోంది.
గ్రీన్‌కార్డ్ దరఖాస్తు ప్రక్రియ నిలిపివేయబడినందున .విదేశీ అభ్యర్ధులు అమెరికాలోని టెక్ పరిశ్రమలో అవకాశాలు దక్కించుకోవడం రానున్న రోజుల్లో సంక్లిష్టం కావొచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.గూగుల్, అమెజాన్‌లు వచ్చే ఏడాది వరకు PERM అప్లికేషన్‌లను నిలిపివేశాయి.

PERM అంటే యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ పర్యవేక్షణలో శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ పొందే ప్రక్రియ.దేశంలోకి విదేశీ కార్మికుల ప్రవేశం , అమెరికా( America ) కార్మికుల ఉద్యోగ అవకాశాలు, వేతనాలు లేదా పని పరిస్థితులపై ప్రతికూల ప్రభావం చూపకుండా చూసుకోవడం దీని ముఖ్యోద్దేశం.గ్రీన్‌కార్డు పొందే ప్రక్రియలో దీనిని ప్రారంభ దశగా అభివర్ణిస్తారు.ఈ ఏడాది ప్రారంభంలో అమెజాన్ తన ఉద్యోగులకు ఒక అంతర్గత ప్రకటన చేసింది.2024 వరకు PERM ఫైలింగ్‌లను కొనసాగించలేమని ఓ మెమో జారీ చేసింది.ఇది నిరాశపరుస్తుందని తెలుసునని, కానీ ఈ నిర్ణయాన్ని తేలికగా తీసుకోలేదని మెమోలో పేర్కొన్నారు.

ఇప్పటికే జనవరి 2023లో .గూగుల్ తన PERM అప్లికేషన్‌లను నిలిపివేయడంతో పాటు 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది.2025 తొలి త్రైమాసికం వరకు కంపెనీ PERM ప్రక్రియను పున: ప్రారంభించదని, ఈ ఏడాది ప్రారంభంలో ఉద్యోగులకు గూగుల్ సమాచారం అందించింది.భారీ టెక్ లే ఆఫ్‌ల మధ్య గ్రీన్‌కార్డ్ ప్రక్రియ సంక్లిష్టంగా మారింది.వాషింగ్టన్‌కు చెందిన ప్రముఖ ఇమ్మిగ్రేషన్ న్యాయసంస్థ బెనాచ్ కొలోపీ వ్యవస్థాపక భాగస్వామి అవా బెనాచ్( Ava Benach ) మాట్లాడుతూ.
టెక్ కంపెనీలు గూగుల్ అడుగుజాడల్లో నడుస్తున్నాయన్నారు.ఓపెన్ పొజిషన్ల కోసం ఎక్కువ మంది యూఎస్ కార్మికులు అందుబాటులో వుండటంతో లేబర్ మార్కెట్ పరీక్ష విఫలమవుతోందని, దీని వల్ల టెక్ కంపెనీలకు సమయం, డబ్బు వృథా అవుతోందని కొలోపి వివరించారు.







