మరొక పది రోజులలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఎలక్షన్ హీట్ భారీగా పెరిగిపోయింది.అయితే ఏపీ ఎన్నికలు( AP Elections ) మొత్తం ఒకవైపు అయితే పిఠాపురం ఎన్నికలు మాత్రం మరో వైపు అనేలా ఆసక్తి నెలకొంది పిఠాపురం( Pithapuram ) నుంచి పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎన్నికల బరిలో దిగిన సంగతి తెలిసిందే.
అయితే నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గెలవాలని ఉద్దేశంతో ఇప్పటికే ఎంతోమంది జబర్దస్త్ కమెడియన్లు అలాగే మెగా హీరోలు అందరూ కూడా పిఠాపురంలోనే ఉంటూ ప్రచార కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇలా జబర్దస్త్ కమెడియన్లతో పాటు బుల్లితెర నటీనటులు పిఠాపురం నియోజకవర్గంలో హౌస్ టు హౌస్ వెళ్తూ జనసేనకి తమ ఓటు వేయాలని ప్రచారాలు నిర్వహిస్తున్నారు.అయితే తాజాగా పిఠాపురం రాజకీయాల గురించి వైఎస్ఆర్సిపి నాయకురాలు సినీనటి యాంకర్ శ్యామల( Anchor Shyamala ) స్పందించారు.ఈమె 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) సమక్షంలో వైసిపి పార్టీల చేరిన సంగతి తెలిసిందే.
ఇక ఈమె కూడా వైసిపి పార్టీ( YCP Party ) తరఫున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే పిఠాపురం గురించి యాంకర్ శ్యామల మాట్లాడుతూ అక్కడ వంగ గీతా( Vanga Geetha ) గారి గెలుపు ఖాయమైందని ఆమె గెలుపును అడ్డుకోవడం ఎవరి తరం కాదు అంటూ చేసినటువంటి కామెంట్లు వైరల్ అవుతున్నాయి.పిఠాపురంలో వంగా గీతా గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అందరికీ తెలుసు.అందుకే ఆమె గెలుపును అడ్డుకోవడం ఎవరి తరం కాదు.
ఇక ఆమె అభివృద్ధి పనులు ఆమెను గెలిపిస్తాయని పిఠాపురం ప్రజలు అభివృద్ధి చేసే వారికి ఓటు వేయాలంటూ ఈమె పిలుపునిచ్చారు.ఆ అభివృద్ధి జగన్ మోహన్ రెడ్డి వంగ గీత గారి వల్లే సాధ్యమవుతుందని తెలిపారు.
ఇక పవన్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక పెద్ద స్టార్ హీరో ఆయన గెలుపు ఖాయమైనప్పుడు మిగతా సినిమా వాళ్లను తీసుకువచ్చి ఎందుకు ప్రచారం చేయిస్తున్నారని ఈమె ప్రశ్నించారు.ఇలా పవన్ గెలుపు కష్టమని, వంగ గీత గెలుపు ఖాయమంటూ యాంకర్ శ్యామల చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.