పిట్టకొంచెం కూతఘనం అంటే ఇదే కాబోలు.. రామాయణం మొత్తాన్ని బియ్యం గింజలపై పొదిగిన చిన్నారి!

‘పిట్టకొంచెం కూతఘనం’ అనే నానుడి గురించి మనం చిన్నప్పుడు నుండి వింటూ వున్నాం.దాన్ని అప్పుడప్పుడు నిజం చేసే ఘటనలు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం.

 Vijayawada Girl Padmavathi Srivalli Writes Ramayana On Rice Details, Rice, Viral-TeluguStop.com

ఇక అలాంటివి మన ఇళ్లల్లో జరిగినప్పుడు మాత్రం చెప్పలేని ఆనందం కలుగుతుంది.అవును.

చిన్నపిల్లలు తమ వయసుకి మించి ఏదైనా ఘనతను కనబరిచినపుడు ఏ తల్లిదండ్రులకు ఆనందంగా ఉండదు చెప్పండి.ఇపుడు అలాంటి ఆనందాన్ని ఆ తల్లి దండ్రులు అనుభవిస్తున్నారు.

తమ చిన్నారి సాధించిన ఘనకార్యాన్ని చూసి ఆనందంతో తబ్బుబ్బయిపోతున్నారు.

ఇక విషయంలోకి వెళితే, విజ‌య‌వాడ గొల్లపాలెం గ‌ట్టుకు చెందిన ‘కారుమూరి మౌళ్య ప‌ద్మావ‌తి శ్రీ‌వ‌ల్లి’ అనే చిన్నారి బియ్యం గింజ‌ల‌పై రామాయణం రాసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

చిన్నత‌నం నుంచి ఆమెకు చిత్రలేఖ‌నంపై మ‌క్కువ‌ ఎక్కువ.ఈ క్రమంలో అనేక పోటీల్లో పాల్గొని బ‌హుమ‌తులెన్నో సాధించింది.సుమారు 10 సంవత్సరాల వ‌య‌స్సు నుంచే బియ్యం గింజ‌ల‌పై అక్షరాలు రాయ‌డం నేర్చుకొని అనేక ప్రాజెక్టులు రూపొందించింది.రామాయ‌ణంలోని ముఖ్యాంశాల‌తో ఓ చిత్ర ప‌టాన్ని రూపొందించి వ‌ర‌ల్డ్ బుక్ రికార్డుల్లోకి సైతం స్థానం ద‌క్కించుకోబోతోంది.

Telugu Gollapalem, Ramayana, Ramayanam, Vijayawada, Latest-General-Telugu

ఈ నేపథ్యంలో ఓ మీడియా వేదికగా ఆమె మాట్లాడుతూ.స్వాతంత్య్ర స‌మ‌ర‌యోథుడి జీవిత చ‌రిత్రను బియ్యపు గింజ‌ల‌పై లిఖించడ‌మే త‌న జీవిత ల‌క్ష్యమని చెప్పడం హర్షణీయం.చిన్నత‌నం నుంచే ఆమె ఆయిల్ పెయింటింగ్‌, వాట‌ర్ పెయింటింగ్‌, పాట్ పెయింటింగ్ ఇలా అనేక ప్రక్రియ‌ల్లో శిక్షణ పొందింది.ఆమె ఒక్కో బియ్యపు గింజ‌పై 8 అక్షరాల వ‌ర‌కూ రాసి చూపరులను ఆశ్చర్య పరిచింది.

అలా రాసిన అన్నింటిని రాముడి చిత్రప‌టం చుట్టూ ఎంతో పొందికగా అమ‌ర్చింది.ఈ ప్రాజెక్టును దాత‌లు ఎవ‌రైనా స‌హ‌క‌రిస్తే ప్రముఖ రామ‌ మందిరాలలో ప్రద‌ర్శించ‌డ‌మే తన ల‌క్ష్యమని చెబుతోంది.

మన పద్మావతి శ్రీవల్లి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube