కత్తి మహేష్‌కు ఇది శిక్షా? లేదంటే ప్రమోషనా?

కత్తి మహేష్‌ తాజాగా రాముడిపై, రామాయణంపై చేసిన వ్యాఖ్యల తీవ్రత పెరుగుతుంది.హిందు సమాజం మరియు పలు సంఘాల వారు కూడా కత్తి మహేష్‌పై తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.

 Nagara Bahishkarana For Kathi Mahesh Is Punishment Are Promotion-TeluguStop.com

తాజాగా హిందూ సంఘం వారు పాదయాత్రకు కూడా సిద్దం అయ్యారు.ఈ సమయంలోనే హైదరాబాద్‌లో శాంతిభద్రతు అదుపు తప్పే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతో తెలంగాణ పోలీసు శాఖ కత్తి మహేష్‌ను నగర బహిష్కరణ చేయాలని నిర్ణయించారు.

ఏపీ పోలీసులకు కత్తి మహేష్‌ను అప్పగించేందుకు రంగం సిద్దం అయ్యింది.చిత్తూరు జిల్లాకు చెందిన కత్తి మహేష్‌ను ఏపీ పోలీసులకు అప్పగించి, హైదరాబాద్‌కు మళ్లీ వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించేందుకు రెడీ అయ్యారు.

కత్తి మహేష్‌ను హైదరాబాద్‌ బహిష్కరణ చేయడం రాజకీయ వర్గాల వారిని కూడా విష్మయానికి గురి చేస్తుంది.కత్తి మహేష్‌ను తెలంగాణ నుండి బహిష్కరించి ఏపీకి పంపించడం వల్ల బాబు ప్రభుత్వంను టీ ప్రభుత్వం ఇరుకున పెట్టినట్లయ్యింది.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కత్తి మహేష్‌ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందే అంటూ పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.కత్తి మహేష్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించగా, ఏపీ ప్రభుత్వం ఎలా వ్యవహరించబోతుంది అనే విషయమై ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

కత్తి మహేష్‌ గత కొంత కాలంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్‌పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెల్సిందే.ఈ సమయంలోనే కత్తి మహేష్‌ను ఆంధ్రప్రదేశ్‌కు పంపించడంతో అక్కడ పరిస్థితి సీరియస్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.కత్తి మహేష్‌ మీడియాలో ఎక్కువగా తెలుగు దేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్నాడు.ఆ కారణంగానే వైకాపా నుండి కత్తి మహేష్‌ ఎంపీ స్థానం నుండి ఆశిస్తున్నాడు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది.

ఈ సమయంలోనే వ్యాఖ్యలు చేయడం, హైదరాబాద్‌ బహిష్కరణకు గురికావడం ఏపీకి వెళ్లవల్సి రావడం కత్తి మహేష్‌కు లాభం చేకూర్చే అంశం అంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కత్తి మహేష్‌కు ప్రస్తుతం ఇష్యూతో మరింత పబ్లిసిటీ దక్కే అవకాశం ఉంది.

త్వరలోనే కత్తి మహేష్‌ వైకాపా తీర్థం పుచుకునే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో ఆయనకు వచ్చిన ఇమేజ్‌తో సునాయాసంగానే సీటును ఇచ్చేందుకు జగన్‌ ఆసక్తి చూపించే అవకాశం ఉంది.

ఏపీ నుండి కూడా కత్తి మహేష్‌ను బహిష్కరిస్తే అప్పుడు ఏం జరుగుతుందనేది ప్రస్తుతం చర్చనీయాంశం.ఒకవేళ ఏపీ నుండి బహిష్కరణకు గురైతే ఖచ్చితంగా కత్తి మహేష్‌ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని, అలా కూడా కత్తి మహేష్‌కు లాభం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

మొత్తానికి కత్తి మహేష్‌కు రాజకీయ ఇమేజ్‌ భారీగా వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube