చాలామంది యవ్వనంగా ఉండేందుకు చర్మాన్ని ఆరోగ్యంగా( Skin health ) ఉంచుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.చర్మం ఆరోగ్యం కోసం కాస్మెటిక్స్, ఎన్నో చిట్కాలు పాటిస్తూ ఉంటారు.
అయినప్పటికీ కూడా మనం అనుకున్న విధంగా చర్మం ఉండదు.అయితే పొటాషియం పుష్కలంగా ఉండే లిచి పండు తింటే ఆరోగ్యానికి అలాగే చర్మానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి.
అయితే ఈ పండులో ఉండే డైట్ ఫైబర్ హైబీపీని కూడా అదుపులో ఉంచుతుంది.అంతేకాకుండా విరేచనం సాఫీగా జరిగేలా కూడా చేస్తుంది.
వీటిని తీసుకోవడం వలన ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.
లిచి ఫ్రూట్( Lychee ) లో విటమిన్ సి అధికంగా ఉండడం వలన ఇది తెల్ల రక్త కణాల పనితీరును ప్రోత్సహిస్తుంది.దీంతో రక్త సరఫరా మెరుగై గుండె పనితీరు సక్రమంగా జరుగుతుంది.ఇంకా వీటిలో ఉండే కాపర్, ఐరన్లు శరీరంలోని ఎర్ర రక్త కణా(Red blood cell )ల సంఖ్యను పెంచడం లో ఎంతో మేలు చేస్తుంది.
అయితే ఈ పండులో విటమిన్ సి అధికంగా ఉండడం వలన చర్మంపై ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని కూడా తగ్గిస్తాయి.అలాగే చర్మం యవ్వనంగా మారెందుకు ఈ పండు చాలా ఉపయోగపడుతుంది.
ఇందులో విటమిన్ సి( Vitamin C ) ఉన్న కారణంగా దీన్ని తినడం వలన చర్మం యవ్వనంగా మెరిసిపోతుంది.అలాగే చర్మంపై ముడతలు రాకుండా ఉంటాయి.ఈ పండులో కాపర్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్ మ్యాంగనీస్, లాంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి.ఇవి ఎముకల బలానికి దృఢత్వాన్ని ఇస్తాయి.అలాగే దీనిలో ఫైబర్ కొవ్వును కరిగించే శక్తి కూడా ఉంది.అందుకే ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.
అయినప్పటికీ కూడా ఈ పండును లిమిట్ లోనే తీసుకోవాలి.అధికంగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది.