ఒక సినిమా సక్సెస్ సాధించాలంటే ఆ సక్సెస్ వెనుక ఎంతోమంది కృషి ఉంటుంది.స్టార్ హీరో ధనుష్( Dhanush ) తన సినిమాల కోసం ఎంతో కష్టపడతారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల( Shekar Kammula ) డైరెక్షన్ లో కుబేర సినిమాలో( Kubera Movie ) ధనుష్ నటిస్తున్నారు.ఈ సినిమా కోసం ధనుష్ పడుతున్న కష్టానికి ఫిదా అవ్వాల్సిందేనని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
ఈ సినిమా కోసం ధనుష్ మాస్క్ కూడా ధరించకుండా 10 గంటల పాటు డంప్ యార్డ్( Dump Yard ) ఉన్నారు.దుర్గంధం వాసనను భరిస్తూ ధనుష్ 10 గంటల పాటు ఉండటం అంటే సాధారణ విషయం కాదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ధనుష్ లాంటి హీరోలు ఇండస్ట్రీకి అవసరమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.తెలుగు డైరెక్టర్లకు ప్రాధాన్యత ఇస్తున్న ధనుష్ విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నారు.
కుబేర సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో సైతం మంచి అంచనాలు నెలకొన్నాయి.నాగార్జున( Nagarjuna ) ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.నాగార్జున ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా ధనుష్ నాగ్ కాంబో సీన్స్ సినిమాకు హైలెట్ కానున్నాయి.ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం స్పష్టత లేదు.ఫిదా, లవ్ స్టోరీ సినిమాలతో శేఖర్ కమ్ముల బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను అందుకున్నారు.
ఈ సినిమా కోసం ధనుష్, నాగార్జున ఒకింత భారీ స్థాయిలోనే పారితోషికం అందుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.ధనుష్, నాగ్ సినిమా సినిమాకు క్రేజ్ పెంచుకుంటుండగా ఈ కాంబో మూవీ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది.ధనుష్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా ధనుష్ తెలుగులో మార్కెట్ ను మరింత పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉందని ఆయన అభిమానులు ఫీలవుతున్నారు.