చౌటుప్పల్ లో బీజేపీ(BJP) ఎన్నికల ప్రచార సభలో ఆ పార్టీ అగ్రనేత జేపీ నడ్డా(JP Nadda) పాల్గొన్నారు.మోదీ దేశ ప్రజలకు మంచి పాలన అందించారని పేర్కొన్నారు.
పదేళ్లలో అభివృద్ధిలో దేశాన్ని ఐదో స్థానంలోకి తెచ్చారని జేపీ నడ్డా తెలిపారు.జాతీయ రహదారులు, రైల్వేను ఊహించని విధంగా అభివృద్ధి చేశారని పేర్కొన్నారు.
తెలంగాణకు మూడు వందే భారత్(Vande Bharat) రైళ్లు ఇచ్చారన్న జేపీ నడ్డా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నాలుగు కోట్ల ఇళ్లు నిర్మించామని తెలిపారు.రానున్న ఐదేళ్లలో మరో మూడు కోట్ల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించామని చెప్పారు.
కాంగ్రెస్ జూటా వాగ్దానాలతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందన్నారు.ఈ క్రమంలో దేశ వ్యతిరేకమైన పార్టీ కాంగ్రెస్ ను ఓడించాలని తెలిపారు.