భారత్‌తో అమెరికా ప్రయోజనాలు పరిరక్షించబడతాయి : ఇండో అమెరికన్ కమ్యూనిటీ లీడర్

పెరుగుతున్న చైనా ప్రాబల్యాన్ని ఎదుర్కోవడానికి ఆసియాలో భారత్( India ) ద్వారా అమెరికా ప్రయోజనాలు పరిరక్షించబడతాయన్నారు ఇండో అమెరికన్ కమ్యూనిటీ నేత యోగి చుగ్.( Yogi Chugh ) కాలిఫోర్నియాలో వ్యాపారవేత్తగా రాణిస్తున్న ఆయన భారత్ అభివృద్ధిపై ఉత్సాహంగా వ్యాఖ్యానించారు.

 America Interests Are Protected And Strengthened With A Strong India Says Indian-TeluguStop.com

ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా అవతరించే సామర్ధ్యం ద్వారా భారత్ బలీయమైన పాత్రను నిర్మించిందని యోగి అన్నారు.

న్యూసౌత్ అయినా, ఆఫ్రికాకు వాయిస్ అయినా భారత్ కీలకపాత్ర పోషిస్తూనే వుందని ఆయన పేర్కొన్నారు.

అమెరికా – భారత్ మధ్య బలీయమైన సంబంధాలు వున్నాయని .చాలా మంది దీనిని 21వ శతాబ్ధపు అత్యంత కీలక భాగస్వామ్యమని యోగి తెలిపారు.భారత్ ఎదుగుతున్న కొద్దీ, మధ్యతరగతి, పనిచేయాలనుకునే వారికి ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ( Economy ) అవకాశాలను సృష్టిస్తుందని యోగి చుగ్ ఆకాంక్షించారు.సవాళ్లు వుంటాయని, ఆ సవాళ్లే ప్రజాస్వామ్యాన్ని శక్తివంతం చేస్తుందన్నారు.

అమెరికాలో( America ) ఎవరితోనైనా నేను జరిపే సంభాషణలలో భారతదేశ పురోగతి గురించే వుంటుందని యోగి పేర్కొన్నారు.

Telugu America, America Tech, Harbir, India, India Economy, India America, India

ఇదిలావుండగా.భారతీయులు లేకుండా అమెరికన్ టెక్ ఇండస్ట్రీ మనుగడ కష్టమేనన్నారు సిలికాన్ వ్యాలీ సెంట్రల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సీఈవో హర్‌బీర్ కే భాటియా.( Harbir K Bhatia ) పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .ఒకానొక సమయంలో సేకరించిన డేటా ప్రకారం సిలికాన్ వ్యాలీలొ( Silicon Valley ) 40 శాతం మంది సీఈవోలు , వ్యవస్థాపకులు దక్షిణాసియా లేదా భారతదేశానికి చెందినవారేనని ఆమె తెలిపారు.సిలికాన్ వ్యాలీకి హబ్ అయిన శాంటాక్లారాలో వున్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ . సిలికాన్ వ్యాలీ భవిష్యత్తును పెంచడానికి , అమెరికాలోని కీలక నగరాలకు చెందిన వ్యాపారవేత్తల సమూహంతో ఏర్పడింది.

Telugu America, America Tech, Harbir, India, India Economy, India America, India

సిలికాన్ వ్యాలీలో .పనిచేయడానికి, సృజనాత్మకంగా వుండటానికి సౌకర్యవంతంగా వుంటుందని భాటియా అన్నారు.గూగుల్, యూట్యూబ్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ సంస్థలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నారని ఆమె ప్రశంసించారు.

కృషి, ఉత్పాదకత వంటి ఉత్తమ విలువలను భారతీయులు తీసుకొస్తారని హర్‌బీర్ పేర్కొన్నారు.సిలికాన్ వ్యాలీతో భారతదేశానికి వున్న సంబంధం గురించి ప్రశ్నించగా.దాని విజయంలో ఇండియా కీలకపాత్ర పోషించిందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube