ఏపీలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీపై మంత్రి కారుమూరి నాగేశ్వర రావు( Minister Karumuri Nageswar Rao ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై( Land Titling Act ) చంద్రబాబు, లోకేశ్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి కారుమూరి ఆరోపించారు.
2019 లో అసెంబ్లీలో మంచి యాక్ట్ అంటూ పయ్యావుల కేశవ్( Payyavula Keshav ) మాట్లాడారన్న ఆయన ఇప్పుడు దాచుకో, దోచుకో అన్నట్లుగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.చంద్రబాబు( Chandrababu ) కపట నాటకమాడుతున్నారన్నారు.ఏలూరులో తన కుమారుడిపై ఓడిపోతున్నారని తెలిసి టీడీపీ దాడులకు పాల్పడుతుందని పేర్కొన్నారు.టీడీపీ మ్యానిఫెస్టోను మడిచి ప్రజలు బుట్టలో వేశారని ఎద్దేవా చేశారు.







