మాజీ మంత్రి మల్లారెడ్డి( Former Minister Mallareddy ) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.మేడ్చల్ జిల్లాలో( Medchal District ) పార్టీ మారిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లను తానే కాంగ్రెస్ లోకి( Congress ) పంపానని చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్( BRS ) నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన కౌన్సిలర్లు మరియు కార్పొరేటర్లు కోవర్టులుగా పని చేస్తున్నారని మల్లారెడ్డి తెలిపారు.
వారంతా కాంగ్రెస్ కండువాలు కప్పుకుని బీఆర్ఎస్ పార్టీ కోసం పని చేస్తున్నారని ఆయన వెల్లడించారు.
అంతేకాకుండా పార్టీ మారిన వారంతా తనకు ఫోన్ చేసి మళ్లీ బీఆర్ఎస్ లోకి వచ్చేస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు.అయితే ఎన్నికలు అయ్యేంత వరకు అక్కడే ఉండమని తానే వారికి సూచించానని తెలిపారు.
ప్రస్తుతం మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.







