ఆర్ధిక మాంద్యం ఎఫెక్ట్ : యూఎస్‌లో సమ్మర్ ఇంటర్న్‌షిప్‌ల కోసం భారతీయ విద్యార్ధుల పోరాటం

అమెరికాలో( America ) చదువుతున్న భారతీయ విద్యార్ధులు ఈ వేసవిలో ఇంటర్న్‌షిప్‌లను( Summer Internships ) పొందడంలో తీవ్ర అడ్డంకులను ఎదుర్కొంటున్నారు.దేశవ్యాప్తంగా జాబ్ మార్కెట్ విస్తరణలో గణనీయమైన క్షీణత వుందని విశ్లేషకులు అంటున్నారు.

 Indian Students In Us Struggle For Summer Internships Amid Economic Slowdown Det-TeluguStop.com

విపరీతమైనప పోటీ కారణంగా .జాబ్ ల్యాండ్‌స్కేప్‌ను ఎదుర్కోవడానికి, దానికి ముందు ఆచరణాత్మక అనుభవాన్ని పొందడానికి ఇంటర్న్‌షిప్‌లు అవసరం.అయినప్పటికీ ఎంతోమంది విద్యార్ధులు ఐవీ లీగ్ సంస్థలలో( Ivy League Universities ) రిజిస్టర్ చేసుకున్న వారితో సహా ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను పొందడం సవాల్‌గా మారింది.

ప్రబలంగా వున్న ఆర్ధిక మాంద్యం .ఎంట్రీ లెవల్ ఉద్యోగ అవకాశాల క్షీణతకు దారితీసింది.అమెరికాలో నివసిస్తున్న అనేక మంది విద్యార్ధులు, అకడమిక్ కన్సల్టెంట్లు, భారతీయ అమెరికన్ నిపుణులు ఈ పరిస్ధితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు( US Presidential Elections ) జరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు స్థానిక విద్యార్ధులను నియమించుకోవడానికి ప్రాధాన్యతనిస్తూ ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తున్నాయి.దీనికి తోడు పెరిగిన ద్రవ్యోల్బణం, పెరుగుతున్న జీవన వ్యయాలు, స్థానిక నిరుద్యోగ రేట్లు , స్పాన్సర్‌షిప్ సంక్లిష్టత వంటి అంశాలు ఈ ఏడాది అమెరికాలో తమ చదువులు పూర్తి చేయడానికి భారతీయ విద్యార్ధులు( Indian Students ) ఎదుర్కొంటున్న ఇబ్బందులను మరింత పెంచాయి.

Telugu Collegify, Indian, Ivy League, Internships, Job, Presidential, Universiti

‘‘ కాలేజీఫై ’’( Collegify ) అనే ఎడ్యుకేషన్ కన్సల్టింగ్ సంస్థ కో ఫౌండర్ ఆదర్శ్ ఖండేల్వాల్ .( Adarsh Khandelwal ) ఎకనమిక్ టైమ్స్‌తో మాట్లాడుతూ తాను ఈస్ట్ కోస్ట్ , వెస్ట్ కోస్ట్‌లోని ఐవీ లీగ్‌ల నుంచి సుమారు 400 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్ధులకు కౌన్సెలింగ్ ఇచ్చానని తెలిపారు.ఈశాన్య అమెరికాలో వున్న 8 ప్రతిష్టాత్మక ప్రైవేట్ యూనివర్సిటీలను ఐవీ లీగ్ కలిగి వుందని ఆదర్శ్ చెప్పారు.

Telugu Collegify, Indian, Ivy League, Internships, Job, Presidential, Universiti

ఎన్‌వైయూ స్టెర్న్, యూఎస్ బర్కిలీ, బ్రౌన్ యూనివర్సిటీ, పెన్సిల్వేనియా యూనివర్సిటీ వంటి విద్యాసంస్థలలో చేరిన భారతీయ విద్యార్ధులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వెల్లడించారు.ఈ విద్యార్ధులలో చాలా మంది భారత్‌లో ప్లేస్‌మెంట్‌లను పొందేందుకు తమను సంప్రదిస్తున్నారని ఆదర్శ్ చెప్పారు.అధిక డిమాండ్ వున్న సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ , మ్యాథమెటిక్స్( STEM ) రంగాలలో నైపుణ్యం కలిగిన విద్యార్ధులు కూడా ఈ తరహా అడ్డంకులు ఎదుర్కొంటున్నారని నిపుణులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube