తెల్ల జుట్టు.ప్రస్తుత రోజుల్లో కోట్లాది మంది దీని బాధితులుగా ఉన్నారు.అందులో ఎటువంటి సందేహం లేదు.ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే తెల్ల జుట్టు సమస్య కనిపించేది.కానీ, ఇప్పుడు చిన్న వయసు వారు సైతం ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే తెల్ల జుట్టును కవర్ చేసుకునేందుకు కలర్స్ పై ఆధారపడుతుంటారు.
ఒకవేళ మీరు కలర్స్‌తో తెల్ల జుట్టును కవర్ చేసుకోలేకపోతే.చింతించకండి.
ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే సూపర్ ఎఫెక్టివ్ రెమెడీని ట్రై చేస్తే సహజంగానే మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండీ.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్ల బ్లాక్ టీ పౌడర్, గుప్పెడు ఎండిన మందారం పూలు వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.
బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి డికాక్షన్‌ను స్ట్రైనర్ సాయంతో సపరేట్ చేసుకోవాలి.అలాగే ఒక బీట్ రూట్ తీసుకుని పీల్ తొలగించి సన్నగా తురుముకోవాలి.
ఈ తురుము నుంచి జ్యూస్‌ను వేరు చేయాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్నూన్ల హెన్నా పౌడర్, వన్ టేబుల్ స్పూన్ తులసి ఆకుల పొడి, రెండు టేబుల్ స్పూన్ల బీట్ రూట్ జ్యూస్, ఐదారు టేబుల్ స్పూన్ల డికాక్షన్ వేసుకుని అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి గంట పాటు షవర్ క్యాప్ పెట్టేసుకోవాలి.ఆపై ఏదైనా మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చని నీటితో హెయిర్ వాష్ చేసుకోవాలి.
వారంలో ఒక్కసారి ఇలా చేశారంలో తెల్ల జుట్టు క్రమంగా నల్ల బడుతుంది.