చంద్రమోహన్సీనియర్ తెలుగు సినిమా నటుడు.ఎన్నో సినిమాల్లో హీరోగా నటించిన ఆయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు.
పాత్ర ఏదైనా చక్కటి నటన కనబరుస్తూ జనాల నుంచి మంచి ఆదరణ దక్కించుకున్నాడు చంద్రమోహన్.తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు.
తనకు ఏమంటే ఇష్టం ఏమంటే అస్సలు ఇష్టం ఉండదు అనే సంగతి కూడా చెప్పాడు.ఇంతకీ చంద్రమోహనకు ఏవి.ఎందుకు నచ్చవో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
తనకు ముఖ్యంగా రాజకీయాలు, క్రీడారంగం అస్సలు నచ్చవని చెప్పాడు.
వ్యాపారం కూడా తనకు అచ్చిరాలేదని వెల్లడించాడు.అందుకే సినిమా రంగం మీద జీవితాన్ని కొనసాగించినట్లు చెప్పాడు.
అప్పుడూ.ఇప్పుడూ.
ఎప్పుడూ తనకు సినిమాలు అంటేనే ఇష్టం అని చెప్పాడు.సినిమాలతోనే జీవితం, సినిమాలోనే మరణం అని వెల్లడించాడు.
రెండూ నాకు నచ్చవు.వ్యాపారం కూడా నాకు అచ్చి రాలేదు.
అందుకే సినిమాల మీదే ఆధారపడ్డాను.తనకు పద్మశ్రీలు, పద్మభూషణ్ ల మీద ఇష్టం లేదన్నాడు.
ఇస్తానని చెప్పినా వద్దని చెప్తానన్నాడు.తెలుగు సినిమా పరిశ్రమలో తన కంటే ఎక్కువ అర్హత కలిగిన వారికే ఆ అవార్డులు రానప్పుడు తనకు ఇస్తానంటే ఎలా ఒప్పుకుంటాను అని ప్రశ్నించాడు.
కైకాల సత్యనారాయణ, ఎం బాలయ్య, గుమ్మడి, ఎస్వీఆర్, సావిత్రి లాంటి దిగ్గజన నటులకే పద్మశ్రీలు రాలేదన్నాడు.ఎందుకు అంతగొప్ప నటులకు ఇవ్వలేదో ఇప్పటికీ తనకు అర్థం కాలేదన్నాడు.
అంతేకాదు.టాలీవుడ్ కు చెందిన ఓకమెడియన్ కు గిన్నిస్ బుక్ లో చోటు రాగానే పద్మశ్రీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రమోహన్ గుర్తు చేశాడు.ఒక భాషలో ఎక్కువ సినిమాలు చేసినందుకు గిన్నీస్ రికార్డు ఇస్తారా? అని ప్రశ్నించాడు.ఆయన నటించి రెండు మూడు వందల సినిమాల్లో కేవలం పురోహితుడి పాత్రలే చేసినట్లు చెప్పాడు.
వాటిని కూడా లెక్కలోకి తీసుకుంటారా? అని క్వశ్చన్ చేశాడు.అలా అనుకుంటే మనోరమ, నగేష్ లాంటి వాళ్లు వెయ్యికి పైగా సినిమాలు చేసినట్లు చెప్పాడు.వారికి గిన్నీస్ గుర్తింపు ఎందుకు రాలేదో చెప్పాలన్నారు.అటు తెలుగు సినిమా హీరోలకు ముందుండే బిరుదులపైనా ఆయ ఘాటుగా స్పందించాడు.గతంలో తనకు సన్మానం చేసి పెద్ద బిరుదు ఇస్తానని సుబ్బిరామిరెడ్డి చెప్పినా తాను ఒప్పుకోలేదని వెల్లడించాడు.ఎంతో కష్టపడి పరిశోధన చేసిన వారికి ఇవ్వాల్సిన డాక్టరేట్లు.
సినిమా తారకు ఇవ్వడం హాస్యాస్పందం అన్నాడు చంద్రమోహన్.