ఇటీవల రోజుల్లో హెయిర్ ఫాల్( Hair Fall ) సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య లెక్కకు మిక్కిలి గా ఉంది.అయితే కొందరిలో హెయిర్ ఫాల్ అనేది చాలా అధికంగా ఉంటుంది.
దీని కారణంగా కొద్ది రోజుల్లోనే జుట్టు పలుచగా మారిపోతుంటుంది.ఈ క్రమంలోనే జుట్టు రాలడాన్ని అడ్డుకునేందుకు ఖరీదైన ఆయిల్, షాంపూ తో పాటుగా మార్కెట్లో లభ్యమయ్యే సీరం తదితర ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడుతుంటారు.
అయినా సరే జుట్టు రాలడం కంట్రోల్ అవ్వకపోతే తెగ హైరానా పడిపోతుంటారు.మీరు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారా.? అయితే అసలు వర్రీ అవ్వకండి.
ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే హెయిర్ ఫాల్ ఎంత అధికంగా ఉన్నా సరే దెబ్బకు ఆగిపోతుంది.
ఒక్క వెంట్రుక కూడా రాలదు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు మందారం పూలు,( Hibiscus ) నాలుగు మందారం ఆకులు, రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు,( Flax Seeds ) ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు నానబెట్టుకున్న మందారం పువ్వులు, ఆకులు మరియు అవిసె గింజలను వాటర్ తో సహా మిక్సీ జార్లో వేసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ శీకాకై పౌడర్ మరియు వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే జుట్టు రాలడం క్రమంగా తగ్గిపోతుంది.హెయిర్ ఫాల్ అన్న మాట అనరు.జుట్టు రాలడాన్ని అడ్డుకోవడంలో ఈ రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.పైగా ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.అలాగే డ్రై హెయిర్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.
కురులు స్మూత్ అండ్ సిల్కీగా సైతం మెరుస్తాయి.