అచ్చెన్న : జగన్ ను తిడితే వీర్రాజుకేంటి బాధ ?  

ఏపీలో ఇప్పుడు వైసీపీని టాబ్లెట్ చేసుకుని బిజెపి విమర్శలు చేస్తోంది.ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశాఖ వచ్చిన సందర్భంగా శ్రీకాళహస్తిలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా( J.

 Somu Veerraju Serious Comments On Atchannaidu , Ysrcp, Tdp, Chandrababu, Jagan,-TeluguStop.com

P.Nadda ) వైసీపీ ప్రభుత్వాన్ని , జగన్ టార్గెట్ చేసుకుని అనేక విమర్శలు చేశారు.జగన్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయం అయ్యిందని,  కేంద్ర ప్రభుత్వ పథకాలను తామవిగా చెప్పుకుంటూ, పేర్లు మార్చి అమలు చేస్తున్నారని విమర్శలు చేశారు.దీంతో వైసిపి, బిజెపిల మధ్య రాజకీయ దూరం పెరిగిందని, కేంద్ర బిజెపి పెద్దలు వైసీపీ టార్గెట్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుండగానే, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వైఖరి మాత్రం అనేక అనుమానాలకు తావిచ్చే విధంగా  ఉందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

జగన్ పై కేంద్రమే చర్యలు తీసుకోవాలని టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు , ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు చేస్తున్న డిమాండ్లపై సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేయడంపై టిడిపి మండిపడుతోంది.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Telugudesam, Vijayasai, Ysrcp-Politi

రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న సీఎం జగన్ ( CM Jagan )పై కేంద్రం చర్యలు తీసుకోవాలంటే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఎందుకు అంత అసహనం ప్రదర్శించారని అచ్చెన్న నాయుడు ప్రశ్నించారు.రాష్ట్రంలో దారుణాలు, నేరాలు ,ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేసింది వాస్తవమా కాదా అని అచ్చెన్న ప్రశ్నించారు.రాష్ట్రాల్లో పాలన గాడి తప్పునప్పుడు , అరాచకం రాజ్యమేలుతున్నప్పుడు ఆర్టికల్ 35 ప్రకారం కలుగజేసుకునే అధికారం కేంద్రానికి ఉందన్న విషయాన్ని సోము వీర్రాజు తెలుసుకోవాలని అచ్చన్న ( Kinjarapu Atchannaidu )వ్యాఖ్యానించారు.

వైసిపి విధ్వంసాలపై  పోరాడాల్సిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ విధంగా వెనకేసుకురావడం తగదంటూ మండిపడ్డారు.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Telugudesam, Vijayasai, Ysrcp-Politi

ఇప్పటికే టిడిపి, బీజేపీలు పొత్తు పెట్టుకునే ప్రయత్నాలు ఒకవైపు చేస్తున్నా, బిజెపితో పొత్తు వద్దని , ఆ పార్టీ వైసీపీకి అన్ని విధాలుగా సహకరిస్తుందని, టిడిపి క్యాడర్ అధిష్టానం పై ఒత్తిడి చేస్తుంది నిజమేనని నిరూపించే విధంగా సోము వీర్రాజు వైఖరి ఉందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube