రవితేజ( Ravi Teja ) నటించిన మిస్టర్ బచ్చన్( Mr Bachchan ) సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకోవడంతో ఈ సినిమా ఫలితాలపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్( TG Vishwa Prasad ) స్పందిస్తూ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సినిమా ఇలా రావడానికి పూర్తి కారణం హరీశ్ శంకరే( Harish Shankar ) అని ఆయన చెప్పినట్లు ప్రచారం జరిగింది.ఈ నేపథ్యంలో విశ్వప్రసాద్ తాజాగా స్పందించారు.
ఈ మేరకు విశ్వప్రసాద్ మాట్లాడుతూ.హరీశ్ శంకర్ మొదట నాకు మంచి స్నేహితుడు.
ఆ తర్వాత మేమిద్దరం సినిమా కోసం కలిసి వర్క్ చేశాము.
మేకింగ్ పరంగా ప్రతిసారీ మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాము.ఇదే అంశాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పాను.సినిమా సక్సెస్ అయితే ప్రశంసలు అందుతాయి.
అదేవిధంగా ఒక సినిమా మిశ్రమ స్పందనలకు పరిమితమైతే చాలామంది విభిన్నమైన కామెంట్స్ చేస్తుంటారు.అభినందనలు ఎలా అయితే తీసుకుంటామో విమర్శలు కూడా అదే విధంగా స్వీకరించాలి.
అలాగే హరీశ్ శంకర్‌ను ఉద్దేశించి నేను ఎలాంటి కామెంట్స్ చేయలేదు.ఆయనతో మరోసారి కలిసి వర్క్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను.
అద్భుతంగా సినిమా తెరకెక్కించగల సమర్థత ఆయనకు ఉంది.మంచి మనసున్న వ్యక్తి.
తన పారితోషికం నుండి డిస్ట్రిబ్యూటర్లకు నష్టాన్ని భర్తీ చేయడానికి ముందుకు వచ్చారు.
దయచేసి ఈ విధమైన అసత్య ప్రచారం చేయొద్దని కోరుతున్నాను.ప్రతికూల ఫలితం నుంచి మేము ఎన్నో నేర్చుకుని మరో మంచి మూవీతో మీ ముందుకు వస్తాము అని విశ్వ ప్రసాద్ చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో హరీష్ శంకర్ కూడా ఈ విషయంపై స్పందించారు.
ఈ మేరకు ఆయన స్పందిస్తూ.మీ అపారమైన మద్దతు తెలిసి, మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని నేను ఏమాత్రం నమ్మలేదు.
ఒక సక్సెస్ ఫుల్ సినిమా కోసం మరోసారి సెట్స్‌పై మిమ్మల్ని కలిసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము.నాకెంతగానో అండగా నిలిచినందుకు థాంక్యూ సర్ అని రాసుకొచ్చారు.