ప్రతినిత్యం సోషల్ మీడియాలో వందల సంఖ్యలో వీడియోలో ప్రత్యక్షమవుతూ ఉంటాయి.ఇందులో చాలా తక్కువ వీడియోలు మాత్రమే వైరల్ గా మారుతాయి.
ఇందులో ఎక్కువగా నవ్వు తెప్పించే వీడియోలు, అలాగే కొన్ని రకాల జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ కావడం చూస్తూనే ఉంటాము.ఇకపోతే తాజాగా ఫ్యామిలీ ఫంక్షన్ చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఈ వీడియోలో ఓ భర్త( Husband ) తన భార్య 7 నెలల గర్భవతి అయిన సందర్భంగా ఆవిడకు బేబీ షవర్( Baby Shower ) పార్టీని ఏర్పాటు చేశారు.ఈ పార్టీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వైరల్ వీడియో సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.
ఈ వీడియోలో జరిగిన సంఘటన ఎక్కడ జరిగిందో మాత్రం పూర్తి వివరాలు తెలియనప్పటికీ.ఆ సంఘటన మాత్రం విదేశాల్లో జరిగినట్టుగా అర్థమవుతుంది.ఏడు నెలలు గర్భవతి అయిన తన భార్యకు బేబీ షవర్ పార్టీని చేసిన భర్త భార్యకు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు.
అప్పటివరకు అంత సజావుగానే జరిగిన బేబీ షవర్ పార్టీలు అనుకోకుండా జరిగిన సంఘటన ద్వారా భార్య బిత్తర పోయింది.వీడియోలో నీలం రంగు కూడా ధరించిన భర్త ప్రసంగం మొదలుపెట్టాడు.
ఈ నేపథ్యంలో భర్త తన భార్య గురించి పుట్టిబోయే బిడ్డ గురించి మాట్లాడుతాడని అందరు భావించరు.కానీ, అతడు వేరేలా మాట్లాడడం మొదలుపెట్టాడు.
కొద్దిసేపటి తర్వాత అతను ఓ పత్రాన్ని తన లాయర్కు చూపించాడు.ఆ తర్వాత భర్త తన భార్యకు అలాగే అక్కడికి వచ్చిన అతిధులకు, లాయర్ కు అందరికి ఒకేసారి ఓ వీడియో చూపించాడు.ఈ వీడియో చూసిన అందరూ షాక్ గురయ్యారు.ఆ వీడియోలో తన భార్య మరొకరితో అక్రమ సంబంధం( Illegal Affair ) కలిగి ఉన్న ఘటనను చూపిస్తాడు.
దాంతో అతడు ఈ బిడ్డకు నేను తండ్రిని కాదు… వేరే వ్యక్తి అని చెప్పి ఆ వీడియోలో ఉన్న వ్యక్తి పక్కనే ఉండడంతో అతడిని చూపిస్తూ అక్కడ రచ్చ రచ్చ చేస్తాడు.దీంతో అంతా గందరగోళంగా మారిపోయింది అక్కడి పరిస్థితి.