సమ్మర్ సీజన్ మొదలైంది.మార్చి నెల నుంచే ఎండలు ముదరడంతో ప్రజలు బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు.
వేసవి కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలే కాదు.వివిధ రకాల చర్మ సమస్యలు సైతం తీవ్రంగా వేధిస్తుంటాయి.
అందులో డార్క్ లిప్స్ ఒకటి.గులాబి రంగులో ఉండాల్సిన పెదవులు ఎండల దెబ్బకు నల్లగా మారిపోతుంటారు.
దాంతో ఈ సమస్యను ఎలా నివారించుకోవాలో అర్థంగాక తెగ మదన పడిపోతూ ఉంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే టిప్స్‌ను పాటిస్తే ఎండల కారణంగా నల్లబడిన పెదాలను మళ్లీ అందంగా మార్చుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక ఆరెంజ్ పండును తీసుకుని.
దాని నుంచి జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల ఆరెంజ్ జ్యూస్‌లో రెండు టేబుల్ స్పూన్ల వెన్న వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పెదాలకు పట్టించి ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి.ఆపై వేళ్లతో స్క్రబ్ చేసుకుంటూ శుభ్రంగా పెదవులను క్లీన్ చేసుకోవాలి.
ఇలా రోజుకు ఒకసారి చేస్తే నల్లగా మారిన పెదాలు మళ్లీ గులాబి రంగులోకి మారతాయి.ఎండల కారణంగా పెదవులపై ట్యాన్ పేరుకుపోతుంటుంది.
దీనిని తొలగించాలంటే.ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆముదం, వన్ టేబుల్ స్పూన్ నిమ్మ రసం, వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్ వేసి కలుపుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని దూది సాయంతో పెదాలకు పట్టించి ఐదు నిమిషాల వదిలేయాలి.ఆపై నిమ్మ చెక్కతో రుద్దుకుంటూ వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి.

ఇక వేసవిలో నల్లగా మారిన పెదవులు మళ్లీ ఎర్రగా మారాలంటే వాటర్‌తో పాటు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, తాజా పండ్లు వంటివి ఎక్కువగా తీసుకోవాలి.వారానికి ఒకసారైనా టూత్ బ్రష్‌తో షుగర్ అప్లై చేసి స్క్రబ్బింగ్ చేసుకోవాలి.హోమ్ మెడ్ లిప్ బామ్స్‌నే వాడాలి.బీట్‌రూట్, క్యారెట్ జ్యూసులను తరచూ తీసుకోవాలి.