1.భారత్ లో కరోనా
గడచిన గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 16,135 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
2.అల్లూరికి పాదాభివందనం చేస్తున్నాను : మోది
యావత్ భారత్ తరపున మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు పాదాభివందనం చేస్తున్నానని భీమవరంలో అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహావిష్కరణలో ప్రధాని నరేంద్ర మోదివ్యాఖ్యానించారు.
3.త్వరలో అల్లూరి భవన నిర్మాణం : కేటీఆర్
హైదరాబాదులోని కానా మెట్ లో అల్లూరి భవన నిర్మాణం కోసం మూడు ఎకరాల భూమిని సీఎం కేసీఆర్ కేటాయించారని, త్వరలో భవనం నిర్మాణం చేపడుతామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
4.ఏపీకి భారీ వర్ష సూచన
రేపు ఎల్లుండి ఏపీలో భారీ వర్షాలు కురిచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
5.నేడు పంజాబ్ క్యాబినెట్ విస్తరణ
నేడు పంజాబ్ క్యాబినెట్ ను విస్తరించబోతున్నారు.కొత్తగా మరో ఐదుగురికి చోటు దక్కే అవకాశం ఉంది.
6.ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రాష్ట్రాల పర్యటన
నేటి నుంచి ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము రాష్ట్రాల పర్యటనకు వెళ్తున్నారు.
7.గాయాల పాలైన ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్
ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్ ప్రమాదవశాత్తు కాలు జారి పడడం తో గాయాలపాలయ్యారు.
8.ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ గా సినీ శెట్టి
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ (2022) టైటిల్ ను కర్ణాటకకు చెందిన సినీ శెట్టి గెలుచుకున్నారు.
9.మోడీ భీమవరం పర్యటనపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన మాట ప్రకారం సీతారామరాజు విగ్రహావిష్కరణకు హాజరయ్యారని కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
10.అగ్నిపత్ పిటిషన్ లపై వచ్చేవారం విచారించనున్న సుప్రీం
కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అగ్ని పథ్ పథకంపై దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.వచ్చేవారం ఈ పిటిషన్ లను విచారించనున్నారు.
11.జేపీ నడ్డా అధ్యక్షతన బిజెపి సంస్థాగత కార్యదర్శుల సమావేశం
బిజెపి జాతి అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన సోమవారం నోవాటెల్ హోటల్ లో పార్టీ సంస్థగత కార్యదర్శుల సమావేశం నిర్వహిస్తున్నారు.
12.కెసిఆర్ పై బండి సంజయ్ కామెంట్స్
తెలంగాణ సమాజానికి ప్రధానమంత్రి సమాధానం చెప్పారని, సీఎం కేసీఆర్ కు చెప్పాల్సిన అవసరం లేదని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
13.రేపు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం
ఈనెల 5న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
14.ఇల్లందులో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో గత అర్థరాత్రి నుంచి ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వానాల కారణంగా జేకే -5 గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
15.రేపు అదొనిలో సీఎం జగన్ పర్యటన
ఏపీ సీఎం జగన్ రేపు కర్నూల్ జిల్లా ఆదోని నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
16.అల్లూరి విగ్రహాన్ని పార్లమెంట్ అవరణలో అవిష్కరించాలి
అల్లూరు సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంట్ అవరణలో ఏర్పాటు చేయాలని ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజారపు అచ్చెన్న నాయుడు డిమాండ్ చేశారు.
17.ప్రధాని మోదీ పర్యటన… నల్ల జెండాలతో కాంగ్రెస్ నిరసన
ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పర్యటన సందర్భంగా ఏలూరు జిల్లాలోని జంగారెడ్డి గూడెం లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు.
18.మోదీ పర్యటన పై ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన అట్టర్ ప్లాప్ అయ్యింది అని కాంగ్రెస్ కీలక నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.
19.బీసీలంటే బీజేపీ కి ఎందుకు భయం : మంత్రి గంగుల
బీసీలంటే బీజేపీ కి ఎందుకు అంత భయం అని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 48000 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 52,340
.