ఉపాసన కొణిదెల( Upasana Konidela ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మెగాస్టార్ చిరంజీవి కుమారుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగా ఆమె టాలీవుడ్ ప్రేక్షకులందరికీ సుపరిచితమే.
అంతేకాకుండా, ఆమె సామాజిక కార్యకలాపాలకు కూడా ప్రసిద్ధి చెందింది.అపోలో హాస్పిటల్స్‌లో ఆమె చేసే సేవలు ప్రశంసనీయమైనవి.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఉపాసన, రామ్ చరణ్‌తో( Ram Charan ) కలిసి తీసుకున్న ఫోటోలతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి కూడా తరచుగా పోస్ట్ చేస్తూ ఉంటుంది.ఆమె చాలామంది స్టార్ హీరోల భార్యల కంటే డైట్‌పై ఎక్కువ శ్రద్ధ వహిస్తుందని తెలుస్తోంది.
అందుకే ఎప్పుడూ ఆమె ముఖంలో గ్లో కనిపిస్తుంది.హీరోయిన్ల వలె చాలా ఫీట్ గా కూడా ఉంటుంది.
బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఉపాసన 20 ఏళ్ళ వయసులో ఉన్నట్లు కనిపిస్తోంది.మరి అంత ఫిట్ గా, యవ్వనంగా కనిపించడానికి ఆమె ఎలాంటి డైట్ సీక్రెట్స్ ఫాలో అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మెగా కుటుంబంలో ఒకరైన రామ్ చరణ్ భార్య ఉపాసన ఈ ఏడాది జూన్ 20న ఓ ఆడపిల్లకు జన్మనిచ్చిన విషయం విధితమే.పెళ్లి అయిన చాలా సంవత్సరాల తరువాత వారసురాలు రావడంతో మెగా కుటుంబ సభ్యులంతా ఎంతో సంతోషించారు.
పాప పుట్టిన తరువాత జరిగే ప్రతి సందర్భాన్ని ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు.ఈ పాపకు క్లీంకార( Klinkara ) అని పేరు పెట్టారు.
ఇక ఉపాసన డైట్ విషయానికి వస్తే.ఈ మెగా కోడలు సినిమాలు పెద్దగా చూడదు, భర్త సినిమా విషయాల్లో అసలు కలుగ చేసుకోదు.మిగతా విషయాల్లో మాత్రం సూపర్ యాక్టివ్ గా ఉంటుంది.సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ తన మంచి మనసును చాటుకుంటుంది.ఇక అందరూ హెల్తీగా ఉండాలని ఆమె బాగా కోరుకుంటుంది.ఆ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆహారం, ఆరోగ్యానికి సంబంధించి సూచనలు, జాగ్రత్తలు పంచుకుంటుంది.
అంతేకాదు ఫిట్‌నెస్, హెల్త్ పట్ల అవగాహన కల్పించేందుకు, అందర్నీ ఆరోగ్యంగా తయారు చేసేందుకు ‘బిపాజిటివ్’ పేరిట ఒక లైఫ్ స్టైల్ మ్యాగజైన్‌ను సైతం లాంచ్ చేసింది.
• ఉపాసన డైట్ సీక్రెట్స్:
ఉపాసన ఒక హెల్త్ లైఫ్ గడపడానికి చాలా శ్రద్ధ వహిస్తుంది.ఆమె డైట్‌లో ఎలా ఉంటుందంటే
• మార్నింగ్ టైమ్ లో గోరువెచ్చటి వాటర్ లో హనీ, లెమన్ జ్యూస్ మిక్స్ చేసి తాగుతుంది.ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది.
• బ్రేక్ ఫస్ట్‌కు చేయడానికి ముందు 3 స్పూన్ కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసిన బ్లాక్ కాఫీ తీసుకుంటుంది.ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
• బ్రేక్ ఫాస్ట్ ఫుడ్‌గా గుడ్లు మొలకెత్తిన గింజలు, చికెన్ కూర లేదంటే చేపల కూర తీసుకుంటుంది.ఇవి ప్రోటీన్‌తో నిండి ఉంటాయి, ఇది కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది.
• లంచ్‌లో అన్నం, వెజ్ కర్రీస్ తింటుంది.
• డిన్నర్‌లో పెప్పర్ చల్లిన బాయిల్డ్ వెజిటేబుల్స్ తింటుంది ఎందుకంటే అవి తేలికగా జీర్ణమయ్యే ఆహారం.
• రాత్రి 7, అప్పుడప్పుడు 9 గంటలలోపే డిన్నర్ కంప్లీట్ చేస్తుంది.ఉపాసన క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేస్తుంది.ఇది ఆమె ఆరోగ్యాన్ని, ఫిట్‌నెస్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.