స్టార్ హీరో అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna) ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేయడం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా సంచలనం అవుతోందనే సంగతి తెలిసిందే.కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేశారంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై ప్రజల అభిప్రాయం సైతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం కొసమెరుపు.
ఆ చెరువు కలుషితమైన చెరువు అని ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసినా పెద్దగా ప్రయోజనం అయితే ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పరిశ్రమల వ్యర్థాల వల్ల నగరంలోని చెరువులు అన్నీ కలుషితం అవుతున్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అదే సమయంలో ఎన్ కన్వెన్షన్( N Convention) నిర్మాణం అక్రమమైతే అనుమతులు ఇచ్చిన అధికారులను సైతం శిక్షించాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ముందస్తు సమాచారం ఇవ్వకుండా నాగ్ ప్రాపర్టీని కూల్చివేయడం ద్వారా ఆయన పరువుకు భంగం కలిగిందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.నాగార్జున కోర్టు నుంచి స్టే తెచ్చుకునే సమయానికి అధికారులు ప్రాపర్టీని కూల్చివేశారు.ఈ వివాదం కక్ష సాధింపు చర్యల్లో భాగమనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి.రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.నాగార్జున మాత్రం ఎన్ కన్వెన్షన్ కూల్చివేత విషయంలో ఒకింత సీరియస్ గానే ఉన్నారని సమాచారం అందుతోంది.నాగార్జున కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.
నాగార్జున నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లలో నటించి మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.నాగార్జున పేరు నెగిటివ్ గా వినిపించడం విషయంలో అభిమానులు సైతం ఒకింత సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది.
నాగార్జున భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవాలని ఆయన అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.