గోల్డెన్ లెగ్ గా మారుతున్న భీమ్లా నాయక్ బ్యూటీ.. హ్యాట్రిక్ హిట్ కొట్టిందిగా..!

సంయుక్త మీనన్.భీమ్లా నాయక్ సినిమాతో తొలిసారిగా తెలుగు సినిమా ఎంట్రీ ఇచ్చింది మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త.

 Samyukta Menon Hatrick Hits In Tollywood , Tollywood , Samyukta Menon, Bhimla Na-TeluguStop.com

వరుసగా మలయాళ చిత్రాల్లో నటిస్తున్న సంయుక్తకు తెలుగులో కూడా హ్యాట్రిక్ హీట్ దక్కింది.భీమ్లా నాయక్ చిత్రం ఘనవిజయం సాధించడంతో తెలుగులో ఈ అమ్మడికి వరస అవాశాలు వచ్చాయి.

భీమ్లా నాయక్ సినిమా తర్వాత తెలుగులో కళ్యాణ్ రామ్ సరసన బింబిసార సినిమాలో నటించింది.ఈ చిత్రం కూడా విజయం సాధించింది.

దాంతో సంయుక్త మరోమారు హాట్ టాపిక్ గా మారింది.ఇక ఇప్పుడు తమిళ సినిమా సర్ తెలుగు లోకి అనువాదం అయ్యింది.

ఈ చిత్రంలో ధనుష్ సరసన హీరోయిన్ గా సంయుక్త నటించింది.దీంతో మూడు వరస సినిమాల్లో విజయం సాధించినట్టు అయ్యింది.

సర్ సినిమాలో మాస్టారు మాస్టారు పాట లో అయితే సంయుక్త ఎంతో చక్కగా కనిపించింది.పైగా పద్ధతిగా చీరలో ఉండటం తో ఎక్కడ ఆమెను అందరూ ఇష్టపడుతున్నారు.

Telugu Bhimla Naik, Bimbisara, Dhanush, Samyukta Menon, Kalyan Ram, Sir, Tollywo

మామూలుగా ఏ పెద్ద స్టార్ హీరో సినిమాలో అయిన కూడా హీరోయిన్స్ కి ప్రాధాన్యత చాలా తక్కువగా ఉంటుంది.కానీ సర్ సినిమాలో పరిస్థితి అలా కాదు.ఈ చిత్రంలో హీరోయిన్ సంయుక్త కు నటనకు మంచి స్కోప్ ఉంది.కథలో భాగంగా ఆమెకు మంచి రోల్ దక్కడం తో సినిమాకు సంయుక్త మంచి బలంగా మారింది.

ఇక సర్ సినిమా కమర్షియల్ హంగులతో తెరకెక్క లేదు.ఈ సినిమాకు కథనే బలం.అందుకే అటు ధనుష్ తో పాటు ఇటు సంయుక్త కి కూడా మంచి బలమైన పాత్ర దక్కింది.అందుకే ప్రజలు ఈ సినిమాకు నీరాజనాలు పడుతున్నారు.

మామూలుగా ఈ మధ్య కాలంలో ధనుష్ ఎంచుకుంటున్న సినిమాలన్నీ కూడా మంచి కథాబలం ఉన్న పాత్రలు కావడం తో ధనుష్ సరసన నటించేందుకు హీరోయిన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

Telugu Bhimla Naik, Bimbisara, Dhanush, Samyukta Menon, Kalyan Ram, Sir, Tollywo

ఇక సంయుక్త మీనన్ విషయానికి వేస్తే ఈమె ఎక్కువగా మలయాళ సినిమాల్లో మాత్రమే నటించేది.ఇక తెలుగులో హ్యాట్రిక్ విజయాలతో సంయుక్త మరింత బిజీ హీరోయిన్ అయ్యింది.ప్రస్తుతం సంయుక్త చేతిలో మరో రెండు తెలుగు సినిమాలతో పాటూ బింబిసార సీక్వెల్ కూడా ఉంది.

ఇందులో ఈ ఒక్క చిత్రం హిట్ అయిన కూడా ఆమెకు తెలుగు లో మరికొన్ని ఏళ్ల పాటు తిరుగు ఉండదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube