టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ( Mass.Maharaja Ravi Teja )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
రవితేజ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు రవితేజ.
అందులో భాగంగానే ఇటీవలే మిస్టర్ బచ్చన్ ( Mr.Bachchan )సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ నీ తెచ్చుకుంది.దీంతో అభిమానులు రవితేజ పై మండిపడిన విషయం తెలిసిందే.కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా చేశారు.
ఇటీవల కాలంలో రవితేజ నటించిన సినిమాలు చాలా వరకు ప్లాప్ అవుతుండడంతో ఈ సినిమా అయినా తప్పకుండా సక్సెస్ అవుతుందని అందరూ భావించారు.కానీ ఈ సినిమా కూడా అదే బాట పట్టడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ఇకపోతే ఆ సంగతి పక్కన పెడితే తాజాగా సోషల్ మీడియాలో రవితేజకు సంబంధించిన ఒక ఫోటో వైరల్ కావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
అదేమిటంటే హాస్పిటల్ లో రవితేజ బెడ్ పై చికిత్స తీసుకుంటున్న ఫోటో వైరల్ గా మారింది.అందులో రవితేజకు చాలామంది డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు.అయితే కంగారు పడాల్సిన అవసరం లేదని డాక్టర్స్ చెబుతున్నారు.
అసలు విషయం ఏమిటంటే.భాను భోగవరపు ( Bhanu Bhogavarapu )దర్శకత్వంలో ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ తన 75వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా షూట్లో చిన్న ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో రవితేజ కుడిచేతి కండరాలు చిట్టినట్లుగా తెలుస్తోంది.అయినా సరే లెక్క చేయకుండా రవితేజ షూట్లో పాల్గొనడంతో గాయం మరింత ఎక్కువవడంతో వెంటనే ఆయన హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ లో జాయిన్ అయ్యారట.
రవితేజని గాయాన్ని పరిశీలించిన డాక్టర్స్.వెంటనే ఆయనకు సర్జరీ చేయాలని చెప్పి అందుకు తగిన ఏర్పాట్లను చేశారట.
ప్రస్తుతం రవితేజకు సర్జరీ పూర్తయింది.గత కొన్ని రోజులుగా ఆయన విశ్రాంతి లేకుండా షూటింగ్స్ చేస్తుండటంతో పాటు, ఇప్పుడీ సర్జరీ మొత్తంగా ఆయనకు ఆరు వారాల పాటు బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్స్ సూచించారని తెలుస్తోంది.
ఇక రవితేజ సర్జరీకి సంబంధించి ఒక పిక్ సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.ఈ పిక్ చూసిన వారంతా రవితేజకు చిన్న ప్రమాదం కాదు పెద్ద ప్రమాదమే జరిగింది అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక రవితేజ వీలైనంత తొందరగా కోలుకోవాలని కామెంట్ చేస్తున్నారు అభిమానులు.