ఈ మధ్యకాలంలో పౌరాణిక కథలతో సినిమాలు చాలావరకు బాగానే వర్కౌట్ అవుతున్నాయి.ఉదాహరణకు ప్రభాస్( Prabhas ) నటించిన కల్కి సినిమాని తీసుకోవచ్చు.
ఇందులో ప్రభాస్ కర్ణుడిగా కనిపించి థియేటర్లలో గూస్ బంప్స్ తెప్పించిన విషయం తెలిసిందే.అలాగే తేజా సజ్జా హీరోగా నటించిన హనుమాన్ చిత్రం( Hanuman movie) కూడా ఆంజనేయ స్వామి బ్యాక్ డ్రాప్ తో వచ్చి అదరగొట్టింది.
కార్తికేయ 2 శ్రీకృష్ణుడి నేపథ్యంలో తెరకెక్కి పాన్ ఇండియా హిట్ గా నిలిచింది.అయితే ప్రస్తుతం ప్రస్తుతం బాలీవుడ్ లో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా రామాయణ చిత్రం తెరకెక్కుతోంది.
సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తోంది.అయితే ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ స్టార్ కాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ చబ్రా ( Director Mukesh Chabra )ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.శ్రీరాముడి పాత్రకు ఎవరు బాగా సెట్ అవుతారు అనే ప్రశ్న ముకేశ్ కి ఎదురవ్వగా ఆయన మాట్లాడుతూ.శ్రీరాముడి పాత్రలో కనిపించాలి అంటే చార్మింగ్ లుక్స్ ఉండాలి.
చిరునవ్వుతోనే అందరి ప్రేమని పొందగలగాలి.అలాంటి లక్షణాలు నాకు తెలిసిన నటుల్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి( Superstar Mahesh Babu ) మాత్రమే ఉన్నాయి.
రాముడి పాత్రకి మహేష్ బాబు పర్ఫెక్ట్ ఛాయిస్ అని ముకేశ్ చబ్రా అన్నారు.
ఇక ఆయన చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మహేష్ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, నిజమే శ్రీరాముడి పాత్రకు మహేష్ బాబు బాగా సెట్ అవుతాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా మహేష్ బాబు ఈ వయసులో కూడా 26 ఏళ్ళ కుర్రాడిలా కనిపిస్తూ అమ్మాయిల కలల రాకుమారుడిగా రానిస్తున్నారు.
మహేష్ బాబు ని చూస్తే ఏజ్ తో పాటు అందం కూడా పెరుగుతోందేమో అన్న అనుమానం కూడా రాకమనదు.