ప్రస్తుత ప్రపంచంలో కష్టపడి సంపాదించే వారి కంటే… కష్టపడి సంపాదించిన వారి దగ్గర నుండి దొంగతనం చేసి బతికేయడం చాలామంది చేస్తున్నారు.ముఖ్యంగా నేటి యువత ఇలాంటి అడ్డదారులతోక్కుతూ ప్రజలకు ఎన్నో కష్టాలను మిగిలుస్తున్నారు.
ఈ మధ్యకాలంలో తరచూ చైన్స్ స్నాచింగ్ లకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తున్నాము.తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి దేశ రాజధాని ఢిల్లీ ( Delhi )నగరంలో జరిగింది.
ఈ ఘటనలో దొంగతనం చేస్తున్న దొంగ ప్రజలకు దొరకడంతో అతనిని అక్కడి స్థానికులు చితకబాధి ఆపై పాటలకు డ్యాన్స్ చేయించారు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.ఢిల్లీ నగరంలోని ఎన్సిఆర్ ( NCR )లోని ఓ ప్రాంతంలో మహిళ మెడలోని బంగారం గొలుసును లాక్కోవడానికి ప్రయత్నించగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.
అయితే ఈ నేపథ్యంలో దొంగను మొదటగా పోలీసులకు అప్పగించకుండా అక్కడి స్థానికులు చితకబాదారు.ఆ తర్వాత హర్యాన్వీ పాటకు ఆ దొంగతో డాన్స్ చేయించిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియో గమనించినట్లయితే.కొందరు వ్యక్తులు దొంగ చుట్టూ నిలబడి పాట ప్లే చేయగా అతనితో బలవంతంగా డాన్స్ చేయించడం మనం చూడవచ్చు.దొంగతో పాటు ఈ పాటను అక్కడ చాలామంది ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేయడం వీడియోలో గమనించవచ్చు.ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు.
దొంగను ఇలా కూడా దోపిడీ చేయకుండా నివారించవచ్చు అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.పోలీసులకు అప్పగించకుండా.
, ఇలాంటి హింస లేని అద్భుతమైన శిక్ష వేశారు అంటూ మరికొందరు మెచ్చుకుంటున్నారు.