గ్వాలియర్‌లోని సింధియా స్కూల్‌లో(Scindia School , Gwalior) చదువుతున్న 16 ఏళ్ల మేధాన్ష్ త్రివేది (Trivedi)ఓ సంచలనానికి తెరలేపాడు.చైనా టెక్నాలజీని(Chinese technology) స్ఫూర్తిగా తీసుకుని, ఏకంగా 80 కేజీల బరువు మోయగల పవర్‌ఫుల్ డ్రోన్‌ను స్వయంగా తయారు చేశాడు.MLDT 01 అనే పేరుతో రూపొందిన ఈ డ్రోన్ కోసం మేధాన్ష్ రూ.3.5 లక్షలు ఖర్చు చేసి, కేవలం మూడు నెలల్లోనే పూర్తి చేయడం విశేషం.
యూట్యూబ్‌లో చైనా ఎయిర్ టాక్సీ వీడియో చూస్తుండగా మేధాన్ష్‌కి ఈ ఐడియా తట్టింది.
నాలుగు సీట్లున్న, విపరీతమైన ఖరీదైన డ్రోన్‌ను చూసి, తక్కువ బడ్జెట్‌లో తనదైన డ్రోన్‌ను తయారు చేయాలనుకున్నాడు.అంతే, MLDT 01 పురుడు పోసుకుంది.ఈ ఎలక్ట్రిక్ డ్రోన్‌కు 45 హార్స్‌పవర్ ఉంది.గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఆరు నిమిషాలపాటు గాల్లో చక్కర్లు కొట్టగలదు.
భద్రత దృష్ట్యా, దీని ఎత్తును 10 మీటర్లకు పరిమితం చేశారు.ఈ డ్రోన్ పొడవు, వెడల్పు 1.8 మీటర్లు.
సాధారణంగా వ్యవసాయ డ్రోన్లలో వాడే నాలుగు మోటార్లను ఇందులో ఉపయోగించారు.ప్రస్తుతం మేధాన్ష్ దీని పనితీరును మరింత మెరుగుపరచడానికి హైబ్రిడ్ వెర్షన్‌పై(hybrid version) కసరత్తులు చేస్తున్నాడు.ఈ డ్రోన్ తయారు చేయడానికి ముందు, మేధాన్ష్ రిమోట్ కంట్రోల్ (Medhansh Remote Control)విమానాలు, కార్లు, చివరికి సూసైడ్ డ్రోన్లు కూడా తయారు చేశాడు.
చదువు పూర్తయ్యాక సొంత వ్యాపారం ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ఈ డ్రోన్ అభివృద్ధిలో తన స్కూల్ డీన్ మనోజ్ మిశ్రా తనకు ఎంతో సహాయం చేశారని మేధాన్ష్ కృతజ్ఞతగా తెలిపాడు.విమానాలు ఎలా తయారు చేస్తారనే క్లాస్‌కు హాజరైన తర్వాత త్రివేదికి డ్రోన్లపై ఆసక్తి మొదలైందని మిశ్రా చెప్పారు.త్రివేది స్వయంగా పరిశోధన చేసి, తన టీచర్ల సహాయంతో స్కిల్స్ పెంపొందించుకున్నాడు.
ఈ పిల్లోడి ఆవిష్కరణ వీడియో వైరల్ కాగా దాన్ని చూసి చాలామంది ఔరా అని నోరెళ్లబెడుతున్నారు.