టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా, బీజేపీ నేతగా మాధవీలతకు ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.మాధవీలత చేసే కామెంట్లు సోషల్ మీడియా వేదికగా ఒకింత హాట్ టాపిక్ అవుతుంటాయి.
అయితే తెలంగాణ సీఎంను (CM)టార్గెట్ చేసి మాధవీలత(madhavilatha) చేసిన కామెంట్లు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.రేవంత్ రెడ్డి(Revanth Reddy) సార్ ను కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతున్నానని మాధవీలత ప్రశ్నించారు.
మెదక్ లో ఒక చిన్న పాపపై అత్యాచారం జరిగిందని వాటి గురించి అసెంబ్లీలో మాట్లాడతారా అని ఆమె ప్రశ్నించారు.ఓవైసీ దీని గురించి ప్రశ్నిస్తారా అని ఆమె అన్నారు.
కొడంగల్ లో ఒక రైతు ఆత్మహత్య చేసుకుని తన ఆత్మహత్యకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కుటుంబ సభ్యులే కారణమని పేర్కొన్నారని వాళ్ల కుటుంబానికి పాతిక లక్షలు కాకపోయినా పాతిక వేలు అయినా ఇచ్చారా అని మాధవీలత అన్నారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkata Reddy) రైతు ఇంటికి వెళ్లి పరామర్శించి డబ్బులు ఇచ్చారా అని అన్నారు.అల్లు అర్జున్(Allu Arjun) చేసింది క్రైమ్ కాదని సరైన రీతిలో స్పందింకపోవడం బన్నీ చేసిన తప్పు అని తప్పుకు, నేరానికి, పొరపాటుకు చాలా తేడా ఉంటుందని మాధవీలత పేర్కొన్నారు.బన్నీ కూడా సాధారణ వ్యక్తేనని ఆమె అన్నారు.
సీఎం రేవంత్ ప్రయాణం చాలా బాగుందని ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారని మాధవీలత పేర్కొన్నారు.
దిల్ రాజును (Dil Raju)అడ్డం పెట్టుకుని సినిమా వాళ్లపై పెత్తనం చలాయించవద్దని మాధవీలత అన్నారు.మాధవీలత చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.మాధవీలత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
ఆమె కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో తెలియాల్సి ఉంది.మాధవీలత కామెంట్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మాధవీలత కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.