కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణాన్ని అభిమానులతో పాటు తారలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.పునీత్ రాజ్ కుమార్ కేవలం కొన్ని సినిమాలు మాత్రమే చేసినప్పటికీ ఆయన అంతులేని అభిమానులను సంపాధించుకున్నారు.
పునీత్ రాజ్ కుమార్ జిమ్ లో వర్కవుట్లు చేస్తూ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.అప్పటి నుంచి అనేక మంది సెలబ్రెటీలు పునీత్ ను తలుచుకుని దు:ఖిస్తున్నారు.చిన్న వయసులోనే పునీత్ రాజ్ కుమార్ మనందరినీ విడిచి వెళ్లడం చాలా బాధకరమని అంటున్నారు.చాలా మంది సెలబ్రెటీలు పునీత్ రాజ్ కుమార్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థించారు.
తాజాగా సీనియర్ హీరోయిన్ జయప్రద కూడా పునీత్ ను తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు.పునీత్ మన మధ్య లేడనే విషయం నమ్మలేకపోతున్నా అంటూ ఎమోషనల్ అయ్యారు.రాజ్ కుమార్ కుటుంబంలో నేను కూడా మెంబర్ గా ఉన్నానని అంటోంది.
ఎంతో మంచి మనిషిగా పేరు తెచ్చుకున్న పునీత్ చాలా చిన్న వయసులో మనల్ని విడిచి వెళ్లిపోయాడని జయప్రద ఎమోషనల్ అయ్యారు.పునీత్ ఆత్మకు శాంతి చేకూరలి భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
పునీత్ రాజ్ కుమార్ మనల్ని విడిచి వెళ్లిపోయాడని తెలిసిన తర్వాత చాలా మంది సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు.పునీత్ తన రెండు కళ్లను దానం చేశాడు.
పునీత్ కళ్లతో నలుగురికి డాక్టర్లు చూపును ప్రసాదించారు.తాను చాలా తక్కువ సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ ఆయన అశేష అభిమానుల్ని సంపాధించుకున్నారు.
ఆయన నటనతో పాటు పాటలు కూడా పాడే వారు.జయప్రద అనేక భాషల్లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.
తన అంద చందాలతో అప్పట్లో జయప్రద టోటల్ కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది.ప్రస్తుతం వయసు మీద పడడంతో హీరోయిన్ రోల్స్ కు బ్రేక్ ఇచ్చింది.