ఆ చిన్న తప్పుతో ఫంక్షన్ లో నవ్వులపాలైన ఝాన్సీ.. అసలు ఏం జరిగిందంటే?

కొన్ని కొన్ని సార్లు యాంకర్ లు పొరపాటు పడుతుంటారు.తాము ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియకుండా మాట్లాడుతూనే ఉంటారు.

 Jhansi Was Insult In That Function With That Small Mistake Do You Know What Happ-TeluguStop.com

ముఖ్యంగా వార్తలు చెప్పే యాంకర్లు, సినిమా ఈవెంట్లను చేసే యాంకర్లు మాట్లాడేటప్పుడు అస్సలు పొరపాటు పడకూడదు.లేదంటే లైవ్ లోనే నవ్వుల పాలవుతుంటారు.

అలా ఓసారి చిన్న తప్పు తో ఝాన్సీ కూడా నవ్వుల పాలైంది.ఇంతకూ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

అటు బుల్లితెరపై, ఇటువంటి వెండితెరపై నటిగా, యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఝాన్సీ గురించి అందరికీ పరిచయమే.ఎన్నో సినిమాలలో సహాయ పాత్రలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

బుల్లితెరపై కూడా పలు సీరియల్స్ లలో నటించింది.ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతుంది.

ఇక ఈమె యాంకర్ గా కంటే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

చాలా వరకు యాంకర్ సుమను టార్గెట్ చేసింది ఝాన్సీ.

కానీ సుమను మించలేకపోయింది.ఇక ఈమె తొలిసారిగా సింహాచలం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

ఆ తర్వాత ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుంది.ఈమెకు ఎగిరే పావురమా, జయం మనదేరా, ఫ్యామిలీ సర్కస్, ప్రియమైన నీకు, పెళ్లయిన కొత్తలో వంటి సినిమాలు మంచి గుర్తింపునిచ్చాయి.

Telugu Actress, Anchor Jhansi, Insult, Tollywood-Movie

ఇక యాంకర్ గా బుల్లితెర పై ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోలను చేసింది.సినీ ఈవెంట్ లలో కూడా యాంకర్ గా చేసింది.ఇక సుమ తనకు గట్టి పోటీ గా ఉండటంతో యాంకరింగ్ కెరీర్ కు కాస్త దూరంగా ఉండిపోయింది.కేవలం సినిమాలలో మాత్రమే నటించాలని ఫిక్స్ అయింది.నిజానికి ఈమె యాంకర్ గా చేసినప్పుడు బాగా స్పష్టంగా మాట్లాడేది.

పైగా ఎప్పుడు కూడా తన యాంకరింగ్ పట్ల విమర్శలు ఎదుర్కోలేదు.

కానీ ఓసారి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంది ఝాన్సీ.చాలావరకు మాట్లాడేటప్పుడు ఎటువంటి పొరపాట్లు జరగలేదనే చెప్పాలి.

కానీ గతంలో ఒక చిన్న తప్పు తో అందరి ముందు నవ్వులపాలైన ఝాన్సీ.ఇంతకు తను అలా కావడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Actress, Anchor Jhansi, Insult, Tollywood-Movie

గతంలో ‘మనలో ఒక్కడు‘ అనే సినిమా ఆడియో సక్సెస్ ఈవెంట్ లో ఝాన్సీ యాంకరింగ్ గా చేసింది.అందులో ఎంతోమంది సెలబ్రెటీలు, ప్రజలు పాల్గొన్నారు.ఇక సినిమా ఆడియో సక్సెస్ మీట్ సందర్భంగా అందులో ఆ సినిమా డైరెక్టర్ గురించి, మ్యూజిక్ డైరెక్టర్ గురించి కొన్ని విషయాలు పంచుకుంది.ఇక ఈ సినిమాకు గానం అందించిన ప్రముఖ గాయకుడు ఏసుదాస్ ఉద్దేశించి మాట్లాడింది.

ఏసుదాసు గురించి మాట్లాడుతున్న సమయంలో అమరగాయకుడు ఏసుదాస్ అని అనడంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు.కొందరు బాగా నవ్వుకున్నారు.

కానీ ఝాన్సీ మాత్రం ఈ విషయాన్ని అంతగా పట్టించుకోకపోగా ప్రసంగాన్ని కంటిన్యూ చేసింది.ఇదంతా గతం లో జరగగా ప్రస్తుతం మళ్లీ ఈ విషయం నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఇక ఝాన్సీ ప్రస్తుతం వెండితెరపై మాత్రమే అవకాశాలు అందుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube