కాబోయే భార్యను ప్రేక్షకులకు పరిచయం చేసిన కార్తికేయ.. స్టేజిపైనే?

ఆర్ ఎక్స్ 100 ఫేమ్ హీరో కార్తికేయ, తాన్యా రవిచంద్రన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం రాజా విక్రమార్క. శ్రీ సరిపల్లి దర్శకత్వంలో శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో 88 రామారెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 12వ తేదీ విడుదల కానుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో ఘనంగా నిర్వహించారు.

 Karthikeyan Introduces His Fiance To The Audience On Stage Karthikeyan, Tollywoo-TeluguStop.com

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దిల్ రాజు పాల్గొన్నారు.ఈ వేడుకలో భాగంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ తాను పిలవగానే ఈ కార్యక్రమానికి వచ్చిన దిల్ రాజుకు, సుధీర్ బాబు, విశ్వక్సేన్, శ్రీ విష్ణులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇక కార్తికేయ ఈ సినిమా గురించి మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా పేరును తన సినిమాకు పెట్టుకునే స్థాయి తనకు లేదని ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడారు.కానీ చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని చూస్తూ ఆయన చేసే పాత్రలో తనని తాను ఊహించుకుంటూ పెరిగానని ఈ సందర్భంగా కార్తికేయ చిరంజీవి పై తనకున్న అభిమానాన్ని తెలియజేశారు.

ఈ టైటిల్ కన్నా ముందు దర్శకుడు వేరే టైటిల్ పెట్టాలని భావించారు అయితే నేను చెప్పడంతో ఒకరోజు టైం తీసుకొని ఈ టైటిల్ ను ఓకే చేశారు.అలా ఈ సినిమాకు రాజా విక్రమార్క టైటిల్ పెట్టడం జరిగిందని కార్తికేయ తెలిపారు.

Telugu Audience, Fiance, Karthikeyan, Raja Vikramarka, Tollywood-Movie

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా కార్తికేయ తనకు కాబోయే భార్యను కూడా అందరికీ పరిచయం చేశారు.ఈ క్రమంలోనే తన ప్రేమ గురించి తెలియజేస్తూ మొదట తనకు తానే ప్రపోజ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.హీరో అవ్వడానికి ఎంత కష్టాలు పడ్డాడు తనకి ప్రపోజ్ చేయడానికి కూడా అన్ని కష్టాలు పడ్డానని ఈ సందర్భంగా కార్తికేయ తన ప్రేమ గురించి తెలియజేశారు.ఈ క్రమంలోనే తనకు కాబోయే భార్య లోహితను వేదికపై అందరికీ పరిచయం చేయడమే కాకుండా నవంబర్ 21వ తేదీ పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube