టీ పొడి తో వారానికి ఒక‌సారి ఇలా చేస్తే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు!

ఉదయం లేవగానే టీ తాగే అలవాటు మ‌న‌లో చాలా మంచిది ఉంటుంది.టీ ( tea )తోనే రోజును ప్రారంభించే వారు కూడా లెక్కకు మిక్కిలిగా ఉన్నారు.

 How To Stop Hair Fall With Tea Powder! Tea Powder, Tea Powder Benefits, Latest N-TeluguStop.com

పొద్దు పొద్దున్నే ఒక కప్పు టీ తాగితే వచ్చే హాయే వేరు.లిమిట్ గా తీసుకుంటే టీ వ‌ల్ల ఎలాంటి న‌ష్టాలు ఉండ‌వు.

పైగా జుట్టు సంరక్షణకు కూడా టీ అద్భుతంగా సహాయపడుతుంది.ముఖ్యంగా రెండు స్పూన్ల టీ పొడి తో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు.

Telugu Black, Care, Care Tips, Remedy, Latest, Long, Fall, Tea Powder, Teapowder

అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి.వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో రెండు స్పూన్లు టీ పౌడర్ వేసుకోవాలి.కావాలి అనుకుంటే మీరు గ్రీన్ టీ పౌడ‌ర్( Green tea powder ) ను కూడా ప్రిఫ‌ర్ చేయ‌వ‌చ్చు.అలాగే గుప్పెడు ఎండిన గులాబీ రేకులు( Dried rose petals ), రెండు రెబ్బలు కరివేపాకు వేసి వాటర్ సగం అయ్యేంత వరకు మరిగించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

Telugu Black, Care, Care Tips, Remedy, Latest, Long, Fall, Tea Powder, Teapowder

ఈ వాటర్ ను పూర్తిగా చల్లారబెట్టుకోవాలి.ఆ తర్వాత జుట్టు మొత్తం తడిచేలా తలపై పోసుకుని రెండు చేతులతో స్కాల్ప్ ను బాగా మసాజ్ చేసుకోవాలి.ప‌ది నిమిషాలు మసాజ్ చేసుకున్న తర్వాత షవర్ క్యాప్ ధరించాలి.

గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే జుట్టు రాలమన్నా రాల‌దు.

హెయిర్ ఫాల్ సమస్యను దూరం చేయడానికి ఈ హోమ్ రెమెడీ చాలా అంటే చాలా అద్భుతంగా సహాయపడుతుంది.ఈ రెమెడీని పాటిస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.ఒత్తుగా పెరుగుతుంది.అలాగే టీ పౌడ‌ర్ జుట్టులో మెలనిన్ ఉత్పత్తి తగ్గకుండా చేస్తుంది.

ఫలితంగా వైట్ హెయిర్ సమస్య త్వరగా రాకుండా ఉంటుంది.కాబట్టి హెయిర్ ఫాల్ సమస్యతో సతమతం అవుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube