టీ పొడి తో వారానికి ఒక‌సారి ఇలా చేస్తే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు!

ఉదయం లేవగానే టీ తాగే అలవాటు మ‌న‌లో చాలా మంచిది ఉంటుంది.టీ ( Tea )తోనే రోజును ప్రారంభించే వారు కూడా లెక్కకు మిక్కిలిగా ఉన్నారు.

పొద్దు పొద్దున్నే ఒక కప్పు టీ తాగితే వచ్చే హాయే వేరు.లిమిట్ గా తీసుకుంటే టీ వ‌ల్ల ఎలాంటి న‌ష్టాలు ఉండ‌వు.

పైగా జుట్టు సంరక్షణకు కూడా టీ అద్భుతంగా సహాయపడుతుంది.ముఖ్యంగా రెండు స్పూన్ల టీ పొడి తో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేస్తే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు.

"""/" / అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో రెండు స్పూన్లు టీ పౌడర్ వేసుకోవాలి.

కావాలి అనుకుంటే మీరు గ్రీన్ టీ పౌడ‌ర్( Green Tea Powder ) ను కూడా ప్రిఫ‌ర్ చేయ‌వ‌చ్చు.

అలాగే గుప్పెడు ఎండిన గులాబీ రేకులు( Dried Rose Petals ), రెండు రెబ్బలు కరివేపాకు వేసి వాటర్ సగం అయ్యేంత వరకు మరిగించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

"""/" / ఈ వాటర్ ను పూర్తిగా చల్లారబెట్టుకోవాలి.ఆ తర్వాత జుట్టు మొత్తం తడిచేలా తలపై పోసుకుని రెండు చేతులతో స్కాల్ప్ ను బాగా మసాజ్ చేసుకోవాలి.

ప‌ది నిమిషాలు మసాజ్ చేసుకున్న తర్వాత షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే జుట్టు రాలమన్నా రాల‌దు.హెయిర్ ఫాల్ సమస్యను దూరం చేయడానికి ఈ హోమ్ రెమెడీ చాలా అంటే చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

ఈ రెమెడీని పాటిస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.ఒత్తుగా పెరుగుతుంది.

అలాగే టీ పౌడ‌ర్ జుట్టులో మెలనిన్ ఉత్పత్తి తగ్గకుండా చేస్తుంది.ఫలితంగా వైట్ హెయిర్ సమస్య త్వరగా రాకుండా ఉంటుంది.

కాబట్టి హెయిర్ ఫాల్ సమస్యతో సతమతం అవుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

నాగపూర్ ఎన్ఐటి క్యాంపస్ రిక్రూట్మెంట్లో సత్తాచాటిన మిర్యాలగూడ వాసి