చలికాలం రానే వచ్చింది.ఈ సీజన్ లో పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అందరినీ ప్రధానంగా వేధించే సమస్యల్లో జలుబు ఒకటి.
ఇంట్లో ఒకరికి జలుబు వచ్చిందంటే చాలా తేలిగ్గా మిగతా వారికి కూడా సోకుతుంది.ఇక జలుబు ఒంటరిగా వస్తుందా.
దానితోపాటే దగ్గు, జ్వరం,( Cough fever ) గొంతు నొప్పి వంటి సమస్యలను కూడా మోసుకొస్తుంది.ఇవన్నీ వచ్చాక ముప్ప తిప్పలు పడే కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఆహారాలను డైట్ లో చేర్చుకుంటే చలకాలంలో జలుబు సమస్యకు( cold problem ) దూరంగా ఉండవచ్చు.మరి లేటెందుకు ఆ ఆహారాలు ఏంటో ఓ చూపు చూసేయండి.

బెల్లం( Jaggery ) రుచిగా ఉండడమే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా ప్రస్తుత ఈ వింటర్ సీజన్ లో రోజుకు చిన్న బెల్లం ముక్క తింటే జలుబు, దగ్గు వంటి సమస్యలు వేధించకుండా ఉంటాయి.రక్తహీనత పరార్ అవుతుంది.మరియు చలిని తట్టుకునే సామర్థ్యం కూడా లభిస్తుంది.
నెయ్యి.( Ghee ) చాలామంది బరువు పెరుగుతామనే కారణంతో దీన్ని అవాయిడ్ చేస్తుంటారు.
కానీ మితంగా తీసుకుంటే నెయ్యి వల్ల వెయిట్ గెయిన్ కాదు లాస్ అవుతారు.అందులోనూ ఈ చలికాలంలో రోజుకు ఒక స్పూన్ నెయ్యిని ఏదో ఒక రూపంలో తీసుకుంటే మన రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.
ఫలితంగా జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.

అలాగే ఈ చలికాలంలో రోజు ఉదయాన్నే రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించి తేనెలో ముంచి తినండి.ఇలా చేయడం తేనె, వెల్లుల్లి( Honey garlic ) లో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి.సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తాయి.
ఇక ఈ వింటర్ సీజన్ లో ఏ సమస్య లేకుండా హెల్తీగా ఉండాలనుకుంటే తాజా కూరగాయలు, సిట్రస్ పండ్లు, హెర్బల్ టీలు, వేడివేడి సూప్స్, ఆకుకూరలు వంటివి ఆహారంలో భాగం చేసుకోండి.