పాదాల పగుళ్లు. స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా కోట్లాది మందిని వేధించే కామన్ సమస్యల్లో ఇది ఒకటి.
అందులోనూ ప్రస్తుత ఈ వింటర్ సీజన్ లో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా పాదాల పగుళ్ల సమస్య మరింత అధికంగా వేధిస్తూ ఉంటుంది.కొందరికైతే పాదాల పగుళ్ల వల్ల నడవడానికి కూడా ఎంతో కష్టంగా మరియు బాధాకరంగా ఉంటుంది.
దాంతో పాదాల పగుళ్లను వదిలించుకోవడం కోసం తోచిన ప్రయత్నాలన్నీ చేస్తుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే పాదాల పగుళ్లతో అస్సలు చింతించకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే రెండు పదార్థాలతో చాలా సులభంగా మరియు వేగంగా పాదాల పగుళ్లను నివారించుకోవచ్చు.
మరి ఇంతకీ ఆ రెండు పదార్థాలు ఏంటి.? వాటితో ఎలా పాదాల పగుళ్లు నివారించుకోవాలి.? వంటి విషయాలను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి.ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవ నూనెను వేసి స్పూన్ తో బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.
నైట్ నిద్రించే ముందు ఈ మిశ్రమాన్ని పగుళ్లపై అప్లై చేసి వేళ్లతో స్మూత్ గా మసాజ్ చేసుకోవాలి.
ప్రతి రోజు ఈ విధంగా కనుక చేస్తే నెయ్యి మరియు ఆవ నూనెలో ఉండే పలు సుగుణాలు పగిలిన పాదాలను రిపేర్ చేసి కోమలంగా మరియు మృదువుగా మారుస్తాయి.
పాదాల పగుళ్ల సమస్య నుంచి చాలా వేగంగా బై బై చెప్పవచ్చు.కాబట్టి పాదాల పగుళ్లతో ఎవరైతే తీవ్రంగా బాధ పడుతున్నారో ఖచ్చితంగా వారు నెయ్యి మరియు ఆవ నూనెతో పైన చెప్పిన విధంగా చేయండి.
మంచి ఫలితాలు మీ సొంతం అవుతాయి.







