Prabhas trisha varsham: సెల్ఫ్ డబ్బా వద్దు త్రిష.. నీకంత సీన్ లేదు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్!

కొన్ని కొన్ని సార్లు సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు తమ గురించి తాము డప్పు కొట్టుకుంటూ ఉంటారు.నిజానికి వాళ్ళు చేసింది ఏమీ ఉండదు కానీ చెప్పుకునేది మాత్రం చాలా ఉంటుంది.

 Prabhas Fans Fires On Heroine Trisha Details, Trisha, Prabhas Fan, Heroine Trish-TeluguStop.com

ఇక వాళ్ళు అలా చెప్పుకోవడంతో వారిని బాగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు.ఇప్పుడు అటువంటి పరిస్థితి ఒకప్పటి స్టార్ హీరోయిన్ త్రిష కు ఎదురయింది.

ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా సందడి చేసిన స్టార్ హీరోయిన్ త్రిష.

తన అందంతో ఎంతోమంది కుర్రాలను ఆకట్టుకుంది.తను నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

హీరోలనే కాకుండా దర్శక నిర్మాతలను కూడా తనకోసం ఎదురు చూసేలా చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.అంతేకాకుండా ఈమెకు చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు.

ఈమె తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి నీ మనసు నాకు తెలుసు అనే సినిమాతో 2003లో అడుగు పెట్టింది.ఈ సినిమా అంత సక్సెస్ కాలేకపోగా.ఆ తర్వాత నటించిన వర్షం సినిమా మాత్రం ఆమె కెరీర్ నే మార్చేసింది.ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటించగా.

ఈ సినిమా కొంతవరకు మంచి సక్సెస్ ను ఇచ్చింది.

Telugu Trisha, Trisha Trolled, Prabhas Fan, Prabhas Fans, Tollywood, Varsham-Mov

ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, అతడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.తెలుగుతోపాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో కూడా నటించింది.ఇక ఈమెకు పలు అవార్డులు కూడా అందాయి.

ఈమె అందాల పోటీలలో కూడా మిస్ బ్యూటిఫుల్ స్మైల్ గా ఎన్నికయింది.

గతంలో సినీ ఇండస్ట్రీకి దూరం కాగా మళ్లీ రీ ఎంట్రీ తో పలు సినిమాలలో నటిస్తుంది.

ఇక ఇటీవలే ఓ పాన్ ఇండియా సినిమాలో నటించగా ఈ సినిమా తనకు మంచి సక్సెస్ ను అందించింది.ఇదిలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ నెటిజన్స్ నుండి బాగా ట్రోల్స్ ఎదుర్కొంటుంది.

ఇంతకు అసలు విషయం ఏంటంటే.గతంలో ఈ ముద్దుగుమ్మ నటించిన వర్షం సినిమా రీ రిలీజ్ అయింది.

Telugu Trisha, Trisha Trolled, Prabhas Fan, Prabhas Fans, Tollywood, Varsham-Mov

కారణమేంటంటే ప్రభాస్ ఇండస్ట్రీకి 20 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాను మరోసారి ప్రభాస్ అభిమానుల కోసం విడుదల చేశారు.అయితే షో సందర్భంగా అభిమానులు సందడి చేసిన వీడియోను త్రిష సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది.ఈ సినిమా పట్ల తన ఆనందాన్ని కూడా పంచుకుంది.

అభిమానులు చూపిస్తున్న ప్రేమను మురిసిపోతూ ఎంజాయ్ చేస్తుంది.

అయితే దీంతో ప్రభాస్ అభిమానులు.థియేటర్లో సందడి చేస్తుంది మేమే కదా.అలాంటప్పుడు ప్రభాస్ గురించి, సినీ బృందం గురించి రెండు ముక్కలు మాట్లాడితే ఏం పోయింది.నీ సెల్ఫ్ డబ్బా నువ్వు కొట్టుకోవడం ఏంటి.

అయినా నీకు అంత సీన్ లేదు.ప్రభాస్ గురించి షో వేసాం మరీ ఆయన గురించి మాట్లాడకపోవడం ఏంటి అంటూ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube