యంగ్ రెబల్ స్టార్ గా మన టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు డార్లింగ్ ప్రభాస్.బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు.
ప్రెసెంట్ ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా మాత్రమే తెరకెక్కుతున్నాయి.అయితే మొదటిసారి ప్రభాస్ నటిస్తున్న ఒక సినిమా మాత్రం పాన్ వరల్డ్ గా తెరకెక్కుతుంది.
ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ప్రాజెక్ట్ కే సినిమా కూడా ఉంది.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.మరి పాన్ వరల్డ్ సినిమా అంటే కంటెంట్ కూడా అదే లెవల్ లో ఉండాలి.
అందుకే నాగ్ అశ్విన్ చాలా సమయం కేటాయించి మరీ ఈ కథను సిద్ధం చేసాడు.
ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతున్న ఇప్పటి వరకు మాత్రం ఈ సినిమా కంటెంట్ గురించి నాగ్ అశ్విన్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
ఇటీవలే ప్రభాస్ పుట్టిన రోజు నాడు మాత్రం ఒక పోస్టర్ రిలీజ్ చేసాడు.ఈ పోస్టర్ తోనే కథ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో చెప్పకనే చెప్పా.
అయితే తాజాగా మేకర్స్ ఒక ప్రకటన రిలీజ్ చేసారు.

ప్రాజెక్ట్ కే మేకర్స్ ఈ సినిమాలో కెమికల్ ఇంజినీర్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ ఔత్సాహికులు లేదా ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయడానికి ఇష్టపడే వారి కోసం ప్రాజెక్ట్ కే మేకర్స్ ఒక ప్రకటన రిలీజ్ చేసారు.దీంతో ఇంట్రెస్ట్ ఉన్న వారు ఈ ఆఫర్ ను అందుకోండి అని ఒక ప్రకటన రిలీజ్ చేసారు.మరి ప్రభాస్ సినిమాకు పని చేసే అవకాశం ఎవరు అందుకుంటారో చూడాలి.
ఇక ఇప్పటికే 50 శాతానికి పైగానే ఈ సినిమా షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే, మరొక బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ నటిస్తున్నారు.







