Meera Jasmine : 8 యేళ్లు సహజీవనం చేసిన వ్యక్తిని కాదని రాత్రికి రాత్రే మరో వ్యక్తి తో పెళ్లి !

మీరా జాస్మిన్( Meera Jasmine ).అతిపెద్ద కుటుంబంలో చిన్నమ్మాయి.

 Why Meera Jasmine Left Mandolin Rajesh-TeluguStop.com

కానీ మొదటి నుంచి ఎలాగైనా బాగా డబ్బు సంపాదించి లక్సరీ గా జీవించాలనే కలలు కంటూ పెరిగింది.అతి సాధారణ కుటుంబంలో పుట్టిన ఆమె తన కలలను సాకారం చేసుకోవడానికి సినిమా ఇండస్ట్రీని ఆసరాగా చేసుకుంది.

అలా మలయాళ సినిమాలో మొదట నటించడానికి ఆమెకి అవకాశం దొరికింది ఆ తర్వాత ఆమె నటించిన రెండు సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో హీరోయిన్ గా ఆమెకు మంచి గుర్తింపు లభించింది.అలా తమిళ్, మలయాళం, తెలుగు సినిమాలతో బిజీ హీరోయిన్ గా మారింది.

సినిమాలతో ఆమె జాతీయ అవార్డులు సైతం అందుకున్న అంతకుమించిన వివాదాలను కూడా ఎదుర్కొంది.మరి ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ ని కూడా ఎదుర్కొంది.

Telugu Anil John, Dileep, Malayalam, Mandolin Rajesh, Meera Jasmine, Tamil, Telu

సినిమాల్లో నటిస్తున్న కాలంలోనే మాండోలిన్ రాజేష్( Mandolin Rajesh ) అనే సంగీత విద్వాంసుడితో ప్రేమలో పడింది.దాదాపు వీరి ప్రేమ బంధం ఎనిమిదేళ్లపాటు సాగింది.ఒక ముక్కలో చెప్పాలంటే వీరు సహజీవనం చేశారని కూడా వార్తా పత్రికలు ఎన్నో మార్లు ప్రచురించాయి.అయితే ఈ విషయం ఒకసారి ఇంటర్వ్యూలో అడగగా మీరా జాస్మిన్ సైతం ఒప్పుకుంది.

మరో రెండు మూడేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటానని ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానని చెప్పింది.కానీ వారి బంధానికి ఓవర్ నైట్ పుల్ స్టాప్ పెట్టి అమెరికా నుంచి వచ్చిన కోటీశ్వరుడు అనిల్ జాన్ తో పెళ్లికి సిద్ధపడింది అది కూడా రెండవ పెళ్లికి.

వీరి పెళ్లిలో చాలా రభస కూడా జరిగింది పోలీస్ స్టేషన్ మెట్ల ఎక్కారు చివరికి పెళ్లికి వచ్చిన సెలబ్రిటీలు అంతా కూడా మధ్యలోనే వెళ్లిపోయారు.

Telugu Anil John, Dileep, Malayalam, Mandolin Rajesh, Meera Jasmine, Tamil, Telu

ఇక ఇది మాత్రమే కాదు ఆమె ఒక క్రిస్టియన్ కుటుంబంలో పుట్టింది అయితే కేరళలోని ఒక గుడిలో హిందువులకు మాత్రమే అనుమతి ఉండగా ఆమె అందరికీ ప్రవేశం కల్పించాలి అంటూ స్టేట్మెంట్ ఇచ్చి గుడిలోకి వెళ్లి పదివేల రూపాయల జరిమానా కూడా కట్టింది.ఇక హీరో దిలీప్( Dileep ) సినిమాకి అడ్వాన్స్ తీసుకొని షూటింగ్ చేయాల్సిన టైం కి రాకుండా అతడిని నానా ఇబ్బందులకు గురిచేసింది.చాలా రోజులపాటు మీరా జాస్మిన్ కోసం ఎదురు చూసిన దిలీప్ చివరగా మలయాళ ఇండస్ట్రీలో మీరాని బ్యాన్ చేయించాడు.

అప్పటికే పెళ్ళై విడాకులు తీసుకోకుండా ఉన్న అనిల్ తో ఎప్పుడు ప్రేమలో పడిందో తెలియదు గానీ ఉన్నపలంగా పెళ్లి అనౌన్స్మెంట్ చేసి అందరిని షాక్ గురిచేసింది ఈ విషయం చివరికి రాజేష్ కి కూడా చెప్పలేదు.అంతకు ముందు రోజు రాత్రి వరకు తనతో సంతోషంగా ఉన్న మీరా తెల్లవారి ఇంకొకరితో పెళ్లి చేసుకోవడానికి అతను జీర్ణించుకోలేకపోయాడు.

ఈ విషయం కూడా అప్పట్లో చాలా వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube