ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.భీమ్ పూర్ మండలం పిప్పల్ కోటిలో రోడ్డుపై నాలుగు పులులు కనిపించాయి.
అటుగా వెళ్తున్న ఓ టిప్పర్ డ్రైవర్ పులులు వెళ్తున్న దృశ్యాన్ని సెల్ ఫోన్ లో చిత్రీకరించారు.దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
పులులు ఎప్పుడూ ఎవరి మీద దాడులకు పాల్పడతాయోనన్న భయంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని జీవనం బ్రతుకుతున్నామని వాపోతున్నారు.అటవీశాఖ అధికారులు స్పందించి తమను పులుల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు.







