ఆరోగ్యానికి ముఖ్యమైన డ్రై ఫ్రూట్స్( Dry fruits ) లలో అంజీర్( Anjeer ) ఒకటి అని ఖచ్చితంగా చెప్పవచ్చు.ఎందుకంటే డైట్ లో క్రమం తప్పకుండా అంజీర్ తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
అలాగే నానబెట్టిన అంజీర్ తినడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.అధిక బరువును దూరం చేసుకోవాలనుకునే వారు కూడా నానబెట్టిన అంజీర్ తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఇలాంటి అంజీర్ తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల( Health benefits ) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.చాలామంది బరువు తగ్గడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

అలాంటి వారు ఈ పండ్లను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.ఫైబర్ ఎక్కువగా ఉండే అంజీర్ తినడం వల్ల అధిక బరువు ( Overweight )త్వరగా తగ్గవచ్చు.అయితే వీటిని సరైన మోతాదులో తీసుకుంటూ ఉండాలి.ఎక్కువగా తీసుకుంటే బరువు పెరిగే అవకాశం కూడా ఉంది.ముఖ్యంగా చెప్పాలంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన అంజీర్ తీసుకొని ఆ నీటిని తాగడం వల్ల మలబద్దక సమస్య( Constipation ) దూరమవుతుంది.ఇలాంటి అంజీర్ తీసుకోవడం వల్ల అజీర్ణం కూడా దూరం అవుతుంది.
అలాగే అంజూర్ లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఇందులో ఉండే పొటాషియం బ్లడ్ షుగర్ లెవల్స్( Blood sugar levels ) ను అదుపులో ఉంచుతుంది.

ముఖ్యంగా టైప్ టు డయాబెటిస్( Diabetes ) ని అదుపు చేయడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇంకా చెప్పాలంటే ఇందులోని ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్, ఫినాల్ గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఇంకా చెప్పాలంటే మహిళలలో సంతానోత్పత్తిని పెంచడంలోనూ అంజిర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
చాలా అనారోగ్య సమస్యల్ని దూరం చేయడంలో అంజిర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇందులో జింక్, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి.
నానబెట్టిన ఆంజీర్ పండ్లను తినడం వల్ల హార్మోన్ల మార్పులకు ఎంతో మంచిది.అంజీర్ నానబెట్టి ఉదయాన్నే తిని ఆ నీటిని తాగితే శరీరంలోని వ్యర్ధాలు బయటకు వెళ్లిపోతాయి.
అంతేకాకుండా ఇది మీ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.