సామాజిక మాధ్యమాల ప్రాచుర్యంతో ప్రతి రోజు ఏదో ఒక వింత, విశేషం వైరల్ అవుతోంది.ఫుడ్ ప్రియులకు ప్రత్యేకంగా ఆకర్షించే ‘వైరల్ ఫుడ్స్’( Viral Foods )లో ఒక్కోసారి ఆశ్చర్యానికి గురిచేసే ఘటనలు చోటు చేసుకుంటాయి.
కేవలం రుచితోనే కాదు, ఫుడ్‌లో దొరికే వింత వస్తువులతోనూ కొన్ని వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారుతున్నాయి.తాజాగా థాయిలాండ్‌లోని ఒక హోటల్‌లో చోటుచేసుకున్న ఘటన అలాంటి సందర్భాలలో ఒకటిగా మారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇటీవల కాలంలో రెస్టారెంట్‌లు, హోటల్స్‌లో ఫుడ్ భద్రతపై ప్రజలు అనుమానంతో ఉన్నారు.పలు సందర్భాల్లో ఆహారంలో బొద్దింకలు, పురుగులు, చనిపోయిన కప్పలు, ఇతర జీవుల అవశేషాలు బయటపడటం, సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్ల ప్రజలు బైటకు వెళ్లి తినేందుకు భయపడుతున్నారు.ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసినా, హోటల్స్ సిబ్బంది తాత్కాలికంగా ఫుడ్ క్వాలిటీ మెరుగుపరుస్తున్నట్లుగా నటించి, ఆ తర్వాత తమ పాత పద్ధతులను కొనసాగిస్తున్నారు.

కేవలం ఇలాంటి సంఘటనలు మన దేశంలోనే కాకుండా వేరే దేశాలలో కూడా ఇలాగె ఉన్నట్లు అర్థమవుతుంది.ఇక అసలు విషయంలోకి వెళ్తే.థాయిలాండ్‌లోని ముయాంగ్ రాట్చబురిలో నివసించే రేబాన్ నక్లెంగ్‌బూన్ అనే వ్యక్తికి ఐస్ క్రీమ్ తినే ప్రయత్నంలో షాకింగ్ అనుభవం ఎదురైంది.
ఒక హోటల్‌లో బ్లాక్ బీన్ ఐస్ క్రీం బార్ కొనుగోలు చేసిన అతను, ఐస్ క్రీమ్‌ను ఆరగించేటప్పుడు ఇందులో ఏదో ఉన్నట్లు అనిపించింది.వివరంగా పరిశీలిస్తే, ఐస్ క్రీమ్‌లో ఒక చిన్న పాము అవశేషం గడ్డకట్టినట్లు కనిపించింది.
ఇంకేముంది, వెంటనే ఈ దృశ్యాలను ఫోటోలు తీసి, రేబాన్ నక్లెంగ్‌బూన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.అవి కాసేపట్లోనే వైరల్ అయ్యాయి.ఈ ఘటనపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అతను ఆ హోటల్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
ఈ ఘటన ఫుడ్ భద్రతపై పెద్ద ప్రశ్నలేలు రేపుతోంది.ఫుడ్ సేఫ్టీ అధికారులు మామూళ్లు తీసుకుని, ఇలాంటి విపత్తులను చూసి చూడనట్లు వదిలేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
జనాలు బైట ఫుడ్ తినడానికి భయపడే పరిస్థితులు నెలకొన్నాయి.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం పటిష్టంగా వ్యవహరించాలి.